చికాగో సెక్స్ స్కాండల్ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ - శాండల్ వుడ్ లలో కూడా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దక్షిణాదికి చెందిన కొందరు హీరోయిన్లతో మోదుగుమూడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ - చంద్రకళ దంపతులు అమెరికాలో నడుపుతోన్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టవడంతో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్(హెచ్ ఎస్ ఐ) - ఫెడరల్ ఏజెన్సీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ సెక్స్ రాకెట్ లో అప్రూవర్లుగా మారిన దక్షిణాదికి చెందిన 5గురు హీరోయిన్లు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ రాకెట్ లో బాధితులుగా పేర్కొన్న హీరోయిన్లను హైదరాబాద్ లో హెచ్ ఎస్ ఐ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంలో తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన ఓ ప్రముఖ హీరోయిన్ కు హెచ్ ఎస్ ఐ అధికారులు షాకిచ్చినట్లు తెలుస్తోంది.
గత ఏడాది డిసెంబరులోనే ఆ హీరోయిన్ పై ఐదేళ్ల పాటు ట్రావెల్ బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియని సదరు హీరోయిన్ ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి ...రాత్రికి అక్కడే బస చేసి బెంగుళూరుకు తిరుగుటపా కట్టిందట. తాజాగా, చేపట్టిన విచారణ సందర్భంగా తన బ్యాన్ ను ఎత్తి వేయాలని ఆ హీరోయిన్ అధికారులను వేడుకోగా....వారు ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చారట. తమకు బ్యాన్ ను ఎత్తివేసే అధికారం లేదని చేతులెత్తేశారట. అయితే, ఆమె పేరును బయటపెట్టమని అధికారులు హామీ ఇచ్చారని తెలుస్తోంది. కాగా, తనతో బలవంతంగా వ్యభిచారం చేయించాలని చూస్తున్నారని ఓ నటి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ సెక్స్ రాకెట్ బట్టబయలైన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫెడరల్ ఏజెన్సీ అధికారులు కిషన్ - చంద్రకళలను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇల్లినాయిస్ కోర్టులో వీరి కేసు విచారణలో ఉంది.