శాకుంతలం సమంత లుక్ ఒక అప్‌డేట్‌!

Update: 2021-12-28 23:30 GMT
సమంత ప్రథాన పాత్రలో గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా కు సంబంధించిన అప్డేట్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుణ శేఖర్‌ తన సినిమాల షూటింగ్‌ ను ఏళ్లకు ఏళ్లు చేస్తాడు అనే విమర్శలు ఉన్నాయి. కాని శాకుంతలం సినిమా తో ఆ అపవాదును తొలగించుకునే ప్రయత్నం చేశాడు. చాలా తక్కువ సమయంలోనే సినిమా షూటింగ్‌ ను ముగించాడు. సమంత మరియు ఇతర నటీ నటులు కేవలం మూడు నెలల కాల్షీట్లు మాత్రమే ఇచ్చినా కూడా సినిమా ను పూర్తి చేశాడనే వార్తలు వస్తున్నాయి. సినిమా కరోనా వల్ల ఎక్కువ ఆలస్యం అయినట్లుగా అనిపిస్తుంది కాని అసలు ఈ సినిమా గుణశేఖర్‌ మార్క్‌ తో కాకుండా చాలా తక్కువ సమయంలోనే పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు సినిమాలో సమంత లుక్ కాని ఇతర నటీ నటుల లుక్‌ కాని రివీల్‌ అవ్వలేదు. కనీసం సెట్స్ నుండి రివీల్‌ అవ్వడం.. లీక్ అవ్వడం కూడా ఏమీ జరుగలేదు. కనుక సమంత శాకుంతల గా ఎలా ఉండబోతుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు మేకప్ ఆర్టిస్టుగా వ్యవహరించిన సాదన సింగ్ మాట్లాడటం జరిగింది. సమంత కు తనే మేకప్ చేయడం జరిగిందట. సినిమా గురించి అంచనాలు భారీగా పెరిగేలా వారు మాట్లాడారు. సినిమా లోని సెట్‌ నుండి మొదలుకుని ప్రతి ఒక్కటి కూడా చాలా అద్బుతంగా వచ్చాయన్నారు. సమంత లుక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మెస్మరైజ్‌ చేస్తుందని నమ్మకంగా చెప్పారు. సమంత శాకుంతల దేవి పాత్రలో ఒదిగి పోయి ఉంటుందని ప్రతి ఒక్క అభిమాని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మేకప్‌ ఆర్టిస్టు చేసిన వ్యాఖ్యలు సినిమా స్థాయిని మరింతగా పెంచడంతో పాటు సినిమా నుండి సమంత లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

శాకుతలం సినిమా లో మలయాళ స్టార్‌ నటుడు దేవ్ మోహన్‌ కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్ గా అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హ కూడా నిలువబోతుంది. భరత రాకుమారుడి గా అర్హ కనిపించబోతుంది. అల్లు అర్జున్ మరియు స్నేహాలు అర్హ ను భరత రాకుమారుడిగా చూసి మురిసి పోయారు. వారు కూడా అర్హ ను ఆ గెటప్ లో ఎప్పుడెప్పుడు చూపిస్తామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. సమంత ఫస్ట్‌ లుక్ ను సంక్రాంతికి విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా సమ్మర్‌ లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నారట. ఈ సినిమా ను గుణ శేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. దిల్‌ రాజు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న విషయం తెల్సిందే.



Tags:    

Similar News