కింగ్ ఖాన్ షారూక్ ఈ మధ్య తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. అయితే.. ఈ వార్తలన్నీ ఆయన సినిమాలకు సంబంధించినవి కాకుండా మిగిలినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. తాజాగా ఆయన పేరు మరోసారి వార్తల్లోకి వచ్చేసింది. అయితే.. ఈసారి షారూక్ ప్రమేయం లేకుండానే ఆయన వార్తల్లోకి ఎక్కాల్సి వచ్చింది.
షారూక్ నటిస్తున్న తాజా చిత్రం రాయిస్ షూటింగ్ ప్రస్తుతం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతోంది. ఆదివారం తెల్లవారుజామున షారూక్ కారుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో షారూక్ కారులో లేరు. అయితే.. ఇది ఆకతాయిల చర్యా? లేక.. షారూక్ ను లక్ష్యంగా చేసుకొని రాళ్ల దాడి చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని చెబుతున్నారు. ఏమైనా.. షారూక్ కారు మీద జరిగిన రాళ్లదాడిని గుజరాత్ సర్కార్ సీరియస్ గా తీసుకోవాల్సి ఉంది.