కింగ్ ఖాన్.. బాలీవుడ్ బాద్ షా.. లాంటి పదాలు షారుఖ్ ఖాన్ పేరు ముంగిట ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయిప్పుడు. ఫారుఖ్ కొత్త సినిమా ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే ట్రేడ్ పండిట్లకు ఆశ్చర్యం కలుగుతోంది. షారుఖ్ మార్కెట్ మరీ ఈ స్థాయిలో పడిపోయిందా అని షాకవుతున్నారంతా. కొన్నేళ్ల కిందట షారుఖ్ నటించిన ఫ్లాప్ మూవీ ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఇండియాలో తొలి రోజే రూ.35 కోట్లకు పైగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఐతే ‘జబ్ హ్యారీ..’ సినిమా తొలి వీకెండ్ మొత్తం కలిపితే రూ.50 కోట్లే వసూలు చేసింది. ఇండియా వసూళ్లు రూ.45 కోట్ల దాకా ఉన్నాయంతే. ఏడాది ఏడాదికి ఇండియన్ సినిమాల మార్కెట్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. ‘జబ్ హ్యారీ..’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు.
ఐతే షారుఖ్ ఈ పరిస్థితికి చేరడానికి అతనే కారణమని అంటున్నాడు బాలీవుడ్ పండితులు. ఒకప్పుడు షారుఖ్ తిరుగులేని హీరో. అతడి ముందు మిగతా స్టార్లందరూ దిగదుడుపే. ముఖ్యంగా అమీర్ ఖాన్ అతడి ముందు చిన్నగా కనిపించేవాడు. కానీ ‘లగాన్’ దగ్గర్నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ జాగ్రత్తగా కెరీర్ ను నిర్మించుకున్నాడు. సినిమా సినిమాకూ తన స్థాయి పెంచుకున్నాడు. ‘రంగ్ దె బసంతి’.. ‘3 ఇడియట్స్’.. ‘పీకే’.. ‘దంగల్’ లాంటి కథాబలమున్న.. వైవిధ్యమైన సినిమాలతో తిరుగులేని హిట్లు కొట్టాడు. గొప్ప స్థాయికి చేరుకున్నాడు. అదే సమయంలో షారుఖ్ మాత్రం వరుసగా రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసి ప్రేక్షకుల్లో తనపై నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. కంటెంట్ గురించి పట్టించుకోకుండా కాసుల కోసం రొటీన్ సినిమాలు చేయడం అతడి కెరీర్ ను దెబ్బ తీసింది. గత కొన్నేళ్లలో ‘హ్యాపీ న్యూ ఇయర్’.. ‘దిల్ వాలే’.. ‘రయీస్’ లాంటి రొటీన్ సినిమాలు షారుఖ్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేశాయి. దీంతో షారుఖ్ సినిమా అంటే హడావుడి తప్ప కంటెంట్ ఉండదన్న అభిప్రాయం బలపడిపోయింది. అతడి మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ఆ ప్రభావం ‘జబ్ హ్యారీ..’ మీద పడి ఈ సినిమాకు దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. అమీర్ ఖాన్ ఎంత మంచి సినిమాలు చేసి తన కెరీర్ ను గొప్ప స్థాయికి తీసుకెళ్లాడో.. షారుఖ్ అంత చెత్త సినిమాలు చేసి కెరీర్ ను దెబ్బ తీసుకున్నాడు.