పార్టీకి కూడా మాజీలు డుమ్మా

Update: 2015-07-14 08:20 GMT
బాలీవుడ్‌ చాక్లెట్‌బోయ్‌ షాహిద్‌ కపూర్‌ సైలెంటుగా ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్‌పుత్‌ని పెళ్లాడేసిన సంగతి తెలిసిందే. కొద్దిమంది బంధుమిత్రుల మధ్య మాత్రమే ఈ జంట పెళ్లి జరిగింది. అయితే ఇటీవలే ముంబై పల్లాడియం హోటల్‌లో 37వ ఫ్లోర్‌లో రిసెప్షన్‌ జరిగింది.

ఈ వేడుకలకు మాజీ ప్రియురాళ్లకు ఆహ్వానం అందినా వారంతా స్కిప్‌ కొట్టడం బాలీవుడ్‌లో చర్చకొచ్చింది. అమితాబ్‌ బచ్చన్‌, జెనీలియా, కృతిసనోన్‌, ప్రీతి జింతా, సోనమ్‌, ఆలియా, కంగన వంటి నాయికలు ఈ రిసెప్షన్‌కి హాజరైనా, అందులోంచి అసలైన గ్లామర్‌ మిస్సయ్యిందని ముచ్చటించుకున్నారు. షాహిద్‌ మాజీ ప్రియురాళ్లు ప్రియాంక చోప్రా కానీ, కరీనా కపూర్‌ కానీ ఈ పార్టీలో కనిపించలేదు. కనీసం ఆర్‌.రాజ్‌కుమార్‌ చిత్రంలో కథానాయికగా నటించిన సోనాక్షి సైతం కావాలనే ఈ పార్టీకి డుమ్మా కొట్టిందని చూసినవారంతా చెబుతున్నారు.

టైట్‌ సెక్యూరిటీ మధ్య పార్టీ జరిగింది. పరిమితంగానే అతిధులు కూడా హాజరయ్యారు. ముఖ్యులైన వారంతా కొత్త జంటను ఆశీర్వదించి వెళ్లారు. అయితే ఎక్స్‌ గాళ్‌ ఫ్రెండ్స్‌లో కరీనా మాత్రం నన్ను పిలిస్తే వెళతా అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చిన దరిమిళా.. రిసెప్షన్‌లో తళుక్కుమంటుందేమో అనుకున్నారంతా.. అది సంగతి.
Tags:    

Similar News