అర్జున్ రెడ్డి ఎఫెక్ట్‌ 'జెర్సీ'కి రూ.50 కోట్లు

Update: 2020-09-24 14:00 GMT
విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ 'అర్జున్‌ రెడ్డి'ని హిందీలో 'కబీర్‌ సింగ్‌' టైటిల్‌ తో షాహిద్‌ కపూర్‌ రీమేక్‌ చేసిన విషయం తెల్సిందే. తెలుగులో మాదిరిగా హిందీలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కబీర్‌ సింగ్‌ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.380 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాంతో షాహిద్‌ కపూర్‌ క్రేజ్‌ అమాంతం పెరిగింది. కబీర్‌ సింగ్‌ సినిమా తర్వాత షాహిద్‌ కపూర్‌ తన పారితోషికంను డబుల్‌ చేశాడంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం ఈయన టాలీవుడ్‌ హిట్‌ మూవీ 'జెర్సీ' రీమేక్‌ లో నటిస్తున్నాడు.

అల్లు అరవింద్‌.. దిల్‌ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న 'జెర్సీ' హిందీ రీమేక్‌ కు గాను షాహిద్‌ కపూర్‌ రూ.35 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో షేర్‌ పొందబోతున్నాడు. జెర్సీ సినిమా యావరేజ్‌ హిట్‌ అయినా కూడా మరో 15 కోట్ల వరకు షాహిద్‌ కపూర్‌ లాభాల్లో వాటా వచ్చే అవకాశం ఉంది. కనుక జెర్సీ సినిమాతో షాహిద్‌ కపూర్‌ రూ.50 కోట్ల వరకు దక్కనుందంటూ బాలీవుడ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. 150 కోట్ల టార్గెట్‌ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారట.

నాని హీరోగా తెలుగులో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొంది విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న 'జెర్సీ' సినిమా హిందీలో కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని షాహిద్‌ కపూర్‌ సినిమా రీమేక్ లో నటించడం వల్ల సినిమా మరింత మందికి చేరువ అవుతుందనే నమ్మకంను బాలీవుడ్‌ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. హిందీలో కూడా జెర్సీకి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. లాక్‌ డౌన్‌ కు ముందే షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. త్వరలో సినిమాను మళ్లీ ప్రారంభించి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News