ఎక్స్ లవ్వర్ ఇష్యూ సీక్రెట్ కాదన్న హీరో

Update: 2017-03-24 16:41 GMT
పెళ్లికి ముందు సాగించే ప్రేమ వ్యవహారాలు కాసింత సిత్రంగా ఉంటాయి. సామాన్యుల సంగతి పక్కన పెడితే.. సెలబ్రిటీల ప్రేమకథలన్నీ ఓపెన్ సీక్రెట్లే. ఎవరు ఎవరితో ఎంగేజ్ అయ్యారు. ఎవరెంత డీప్ గా లవ్ లో ఉన్నారు. ఎవరెంత సన్నిహితంగా ఉండటంతో పాటు.. లివింగ్ రిలేషన్ తో ఉన్నారా? లేరా?లాంటి విషయాలు దాదాపుగా బయటకు వచ్చేయటం తెలిసిందే.

మరి.. అలా ఓపెన్ అయిన జంట.. తర్వాతి కాలంలో విభేదాలు వచ్చి కటీఫ్ చెప్పేసుకొని.. ఎవరి దారిన వారువెళుతూ..తర్వాతి కాలంలో ఎవరికి వారు.. తమకు నచ్చిన మరొకరని పెళ్లాడేసి.. పిల్లల్ని కనేయటం మామూలే. అయితే.. ఇలా జరిగిన తర్వాత ఓపెన్ చర్చ జరిగి.. పేరు బయటకురావటమే కాస్తంత అరుదుగా జరిగే వ్యవహారం. తాజాగా అలాంటి ముచ్చటే దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

కొంతకాలం క్రితం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్..టాప్ హీరోయిన్ కరీనా కపూర్ ల మధ్య ఎంత ఘాటు ఎఫైర్ నడిచిందో అందరికి తెలిసిందే. వారిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీకై.. పెను సంచలనాన్నే సృష్టించింది.తర్వాతి కాలంలో ఈ జంట మధ్య బ్రేకప్ జరగటం.. ఎవరి దారిన వెళ్లి.. కరీనా మరో హీరో సైఫ్ అలీఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోగా.. షాహీద్ మీరాఅనే అమ్మాయిన పెళ్లి చేసుకున్నారు. ఈ జంటలకు ఇప్పుడు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్ కు తన పాత ప్రేమ గురించిన వ్యవహారం చర్చకు వచ్చింది. ఒక ప్రేక్షకురాలు షాహిద్ ను ప్రశ్నిస్తూ.. ఒక సీక్రెట్ చెప్పాలని కోరింది. దీనికి బదులిచ్చిన షాహిద్.. ‘‘నాకో సీక్రెట్ ఉన్న విషయం నీకెలా తెలిసింది.’’ అని ప్రశ్నించారు.  చివరకు చెప్పనని అనేశారు.ఇందులో ప్రేక్షకుల మధ్య నుంచి ‘‘కరీనా’’ పేరును పలువురు గట్టిగా అరవటంతో రియాక్ట్ అయిన షాహిద్.. ‘‘అది సీక్రెట్ ఎలా అవుతుంది? అది ఓపెన్ సీక్రెట్’’ అని తేల్చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News