కమర్షియల్ సినిమాను రీమేక్ చేయడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఏదైనా కల్ట్ ఫిలిం ను రీమేక్ చేయడం కత్తి మీద సామే. ఎందుకంటే ప్రతి విషయంలో పోలికలు వస్తాయి. ఒరిజినల్ ను శ్రద్ధగా ఫాలో అయితే కాపీ.. జెరాక్స్ అని విమర్శిస్తారు. ఒకవేళ కొంచెం మారిస్తే 'చెడగొట్టారు' అంటూ విరుచుకుపడతారు. మరో ఇబ్బంది ఏంటంటే.. నటీ నటుల పెర్ఫార్మెన్స్. ఇందులో కూడా సీన్ టూ సీన్ పోలికలు పెట్టి రీమేక్ నటుడిని విమర్శిస్తారు. ఇదంతా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు అవగాహన ఉందేమో కానీ ముందే జాగ్రత్త పడుతున్నాడు.
'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సినిమా దర్శకుడు సందీప్ వంగా ఈ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండ పాత్రలో షాహిద్ కపూర్.. షాలిని పాండే పాత్రలో కియారా అద్వానిలు నటిస్తున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో షాహిద్ కు ఒరిజినల్ సినిమాకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ "అర్జున్ రెడ్డి లో విజయ్ దేవరకొండ నటన అద్భుతం. మీరు నన్ను అడిగితే కబీర్ సింగ్.. అర్జున్ రెడ్డి ఇద్దరినీ నేను కజిన్స్ అంటాను. వారిద్దరూ ఒకే వ్యక్తి కాదు" అన్నాడు.
అంతే కాదు "మేము ఈ సినిమాలో కొంచెం కొత్తగా ట్రై చేశాం. కారణం ఏంటంటే.. నేపథ్యం ఢిల్లీ - ముంబై కి మారింది. దాంతో హీరో పెరిగిన వాతావరణం మారుతుంది. అందుకే అతని ప్రయాణం కూడా కొద్దిగా మారుతుంది. కానీ ఆ పాత్రలో ఉన్న బేసిక్ ఎనర్జీ మాత్రం అలానే ఉంచాం" అన్నాడు. సినిమాకు అవుట్ పుట్ పై నమ్మకంగా ఉన్నామని.. అందరం ది బెస్ట్ ఇచ్చామని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు షాహిద్. మరి ప్రేక్షకులు ఈ రీమేక్ ను ఎంతవరకూ ఆదరిస్తారో ఏంటో తెలియాలంటే జూన్ 21 వరకూ వేచి చూడక తప్పదు.