కబీర్ సింగ్ దెబ్బకు వర్మ సైలెంట్

Update: 2018-11-27 16:57 GMT
ఒక బ్లాక్ బస్టర్ ఒకేసారి రెండు భాషల్లో రీమేక్ అవుతున్నప్పుడు ఎంత వద్దనుకున్నా పోలికలు వచ్చి పడతాయి. కొంత గ్యాప్ ఉంటే పెద్దగా అనిపించదు కానీ అది లేనప్పుడే చిక్కు. విజయ్ దేవరకొండ ని ఒక్క దెబ్బతో యూత్ ఐకాన్ ని చేసేసిన అర్జున్ రెడ్డి తమిళ్ లో వర్మగా హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. వర్మకు కల్ట్ మూవీస్ తీసే బాలా దర్శకుడు. రెండు నెలల క్రితమే టీజర్ తో పాటు పోస్టర్లు కూడా విడుదల చేసారు. చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ హీరోగా వస్తున్న మొదటి సినిమా కాబట్టి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసారు.

కానీ ఊహించని విధంగా ధృవ్ భారీగా ట్రాలింగ్ కు గురయ్యాడు. ఏ కోశానా అర్జున్ రెడ్డి పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్స్ ప్రెషన్స్ కానీ ధృవ్ లో లేవంటూ తమిళ ప్రేక్షకులు కూడా పెదవి విరవడంతో షాక్ తిన్న యూనిట్ చాలా రోజుల నుంచి ప్రమోషన్ ని ఆపేసి సైలెంట్ గా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నా హడావిడి చేయడం లేదు.

మరోవైపు ఒరిజినల్ తీసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ వెర్షన్ కబీర్ సింగ్ లో నటిస్తున్న షాహిద్ కపూర్ సోషల్ మీడియాలో తన లుక్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నాడు. గుబురు గెడ్డంతో మొన్నటి దాకా కనిపించిన షాహిద్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం క్లీన్ షేవ్ చేసి ఫ్యాన్స్ తో ఫుల్ మార్క్స్ వేయించుకున్నాడు. ఇప్పుడు వర్మ గురించి మళ్ళి చర్చ స్టార్ట్ అయ్యింది.

నిన్న గాక మొన్న స్టార్ట్ అయిన కబీర్ సింగ్ లో అంత పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తుంటే షూటింగ్ పూర్తయ్యే స్టేజి లో ఉన్న వర్మ మాత్రం ఎందుకు చప్పుడు చేయడం లేదని డిస్కషన్ జరుగుతోంది. దర్శకుడిగా బాలాకు ఇంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన ప్రీ రిలీజ్ పబ్లిసిటీ కూడా వర్మదే అని చెప్పొచ్చు. చెన్నై టాక్ ప్రకారం బాలా డ్యామేజ్ రిపేర్ లో ఉన్నాడట. ట్రైలర్ లో బాగా నెగటివ్ అనిపించిన సీన్స్ అన్ని మళ్ళి వేసి చూసుకుని అవసరమైన మార్పులు చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి కబీర్ సింగ్ వర్మల పోలికల రచ్చ బాగానే ఉంది.


Tags:    

Similar News