ఆ క్షణం నవ్వాలో ఏడ్వాలో తెలీలే..

Update: 2015-04-15 07:03 GMT
డబ్బును, సమయాన్ని పొదుపుగా ఖర్చు చేసేవాడే ధనవంతుడు. ఖరీదైన జీవితాన్ని గడిపేవాడే, విలాసాలతో తులతూగేవాడు ధనవంతుడు.. అని మనం అనుకుంటాం. ధనవంతునికి బోలెడన్ని కొత్త కొత్త నిర్వచనాలు చెబుతుంటాం. అయితే అవేవీ ధనవంతుడికి నిర్వచనాలు కావని అంటున్నాడు షారూక్‌ ఖాన్‌. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. వారే నా సంపద. కేవలం అభిమానం వల్లే ధనవంతుడినయ్యానని చెప్పుకొచ్చాడు.

నిజమే.. తనని అభిమానించి ఇంతటివాడిని చేసింది అభిమానులే కాబట్టి బాద్‌షా ఈ మాటన్నారు. అంతేకాదు డబ్బును ఎంత జాగ్రత్తగా ఖర్చు చేయాలో సూచించే ఓ సందర్భం గురించి చెప్పారు బాద్‌షా. హ్యాపీ న్యూ ఇయర్‌ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు వన్‌ ఫైన్‌ డే నిర్మాతలు నాకు ఫోన్‌ చేసి డబ్బంతా అయిపోయింది అన్నారు. అయితే ఆ డబ్బును నేను సమకూరుస్తా. ధనవంతుల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లలో డ్యాన్సులు చేసి వచ్చిన డబ్బును ఆ సినిమాకి పెట్టుబడిగా సమకూర్చాను. అలా ఆ సినిమా బైటికి వచ్చింది .. అని బాద్‌షా నవ్వుతూ చెప్పుకొచ్చాడు. సినిమా ఆగింది అంటే సొంత రిస్కుతో అకౌంట ఖాళీ చేసో, ఆస్తులు అమ్మేసో ఖర్చు చేసిన హీరోలెందరినో చూశాం. అలాంటి సందర్భంలో షారూక్‌లా స్పందించేవారెందరు? ఒకవేళ అందరిలానే షారూక్‌ ఆలోచించి ఉంటే తనకి ప్రత్యేకత ఎలా దక్కేది.

ఒక మామూలు మధ్యతరగతి నుంచి వచ్చిన షారూక్‌కి డబ్బు విలువ తెలుసు. అందుకే డ్యాన్సులు చేసి వచ్చిన డబ్బును నిర్మాతలకు ఇచ్చాడన్నమాట! ప్రఖ్యాత మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ప్రకటించిన ధనవంతుల జాబితాలో రెండో వాడిగా నిలిచాడు షారూక్‌. అయితే 2013లో అది ప్రకటించే టైమ్‌లోనే హ్యాపీ న్యూఇయర్‌ షూటింగ్‌ ఆగిపోయే పరిస్థితి. అందుకే ఆ టైమ్‌లో నవ్వాలో ఏడవాలో తెలీలేదని బాద్‌షా చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News