అందుకే మరి.. బాలీవుడ్ బాద్షా అనేది

Update: 2017-02-20 05:29 GMT
బాలీవుడ్ ని ఏలేస్తున్న ఖాన్ త్రయంలో.. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన గుర్తింపు ఉంది. మిగిలిన ఇద్దరి సంగతి పక్కన పెడితే.. షారూక్ ఖాన్ కి మంచి మనిషిగా బోలెడంత ఇమేజ్ ఉంది. బాలీవుడ్ బాద్షా అని.. కింగ్ ఖాన్ అని.. షారూక్ ని పిలిచేది అందుకే. సినిమాల వసూళ్ల స్థాయి తగ్గినా.. షారూక్ స్థాయి పిసరంత కూడా తగ్గదు. అందుకు కారణం.. ఈ స్టార్ హీరో మానవత్వం.

తాజాగా ఇలాంటిదే ఓ ఘటన పబ్లిక్ మధ్యలో జరిగింది. షారూక్ రీసెంట్ గా డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ తో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లాడు. మరుగుజ్జు పాత్రలో హీరో కనిపించే ఈ రోల్ పై డిస్కషన్స్ చేసి బయటకు వచ్చి కారు ఎక్కబోతుంటే.. ఓ బిచ్చగాడు వచ్చి ప్రాథేయపడ్డాడు. 'షారూక్ భాయ్.. నీ కోసమే ఎదురుచూస్తున్నా భాయ్' అంటూ పలకరించాడు. దీంతో ఆ బిచ్చగాడిని పరామర్శించిన షారూక్.. తన చేతిని ఆ బిచ్చగాడిపై వేసి ఏదైనా తింటానికి కావాలా అని అడిగాడు. అంతే కాదు.. తన సెక్యూరిటీ సిబ్బందికి ఆర్డర్స్ కూడా పాస్ చేశాడు.

ఆ తర్వాత షారూక్ తన కారెక్కి వెళ్లిపోయినా.. కింగ్ ఖాన్ వ్యక్తిగత సిబ్బంది మాత్రం ఆ బిచ్చగాడికి ఫుడ్ అందించే ఏర్పాట్లు చేశాకే అక్కడి నుంచి కదిలారని.. స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News