బాలీవుడ్ బాక్సాఫీస్ కి ఊపు తెచ్చిన పఠాన్ 

Update: 2023-01-19 23:30 GMT
షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్ద్ ఆనంద్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా పఠాన్. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. జనవరి 25న పాన్ ఇండియా లెవల్ లో హిందీతో పాటు సౌత్ లో అన్ని భాషలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ పూర్తి స్థాయి రోల్ తో హీరోగా చేస్తున్న మూవీ ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

2018లో జీరో సినిమాతో డిజాస్టర్ కొట్టిన షారుఖ్ ఖాన్ ఆ తరువాత సుదీర్ఘ విరామం తీసుకొని పఠాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై హైప్ ఏ స్థాయిలో ఉంది కాంట్రవార్సీ కూడా అలాగే ఉంది. ఈ మూవీలో బేషారమ్ రంగ్ అనే సాంగ్ వివాదాస్పదంగా మారింది. ఈ సాంగ్ లో క్లోజ్ అప్ షాట్స్ అన్ని కత్తిరించాలని సెన్సార్ బోర్డు కూడా కండిషన్ పెట్టింది. ఈ నేపధ్యంలో ఓ వైపు సోషల్ మీడియాలో సినిమాపై బ్యాన్ పఠాన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.

అయిన కూడా షారుఖ్ ఖాన్ సినిమాలు ఇష్టపడే వారు పఠాన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి పఠాన్ మూవీ చాలా కాలం తర్వాత ఊపు తెచ్చిందని చెప్పాలి. గత రెండేళ్ళుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటుంది. బ్యాన్ బాలీవుడ్ అనే ట్రెండ్ సోషల్ మీడియాలో నడుస్తుంది. ప్రతి సినిమాపై నెగిటివ్ ప్రచారంతో బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ఎఫెక్ట్ పడుతుంది.

అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన లాల్ సింగ్ చద్దా కూడా బాలీవుడ్ ని ఇండస్ట్రీని సేవ్ చేయలేకపోతుంది. 95 శాతం సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. కొన్ని చిన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకులని మెప్పించాయి. ముఖ్యంగా రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్ లతో బజ్ క్రియేట్ చేసే సినిమాలు బ్రహ్మాస్త్ర, వార్ మాత్రమే ఉన్నాయి. అందులో బ్రహ్మాస్త్ర హిట్ అయినా కూడా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు.

వార్ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు పఠాన్  అడ్వాన్స్ బుకింగ్ లతో దేశ వ్యాప్తంగా బజ్ క్రియేట్ అవుతుంది. ఓ వైపు నెగిటివ్ ప్రచారం నడుస్తున్న దానిని లెక్కచేయకుండా ప్రేక్షకులు పఠాన్ సినిమా చూడటం కోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ ల విషయంలో బ్రహ్మాస్త్ర, వార్ సినిమాలని పఠాన్ బీట్ చేసిందనే మాట బిటౌన్ లో వినిపిస్తుంది. అలాగే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బాలీవుడ్ ఇండస్ట్రీకి మళ్ళీ కొత్త కళ తీసుకొస్తుందని అందరూ భావిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News