2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా కింగ్ ఖాన్ షారూక్ నటిస్తున్న `జీరో` చిత్రం పాపులరైంది. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ - మణికర్ణిక తర్వాత రిలీజయ్యే అతిభారీ బాలీవుడ్ చిత్రమిదే. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజవుతోంది. ఈ సినిమా గురించిన ఒక్కో అప్ డేట్ అంతకంతకు హీట్ పెంచుతున్నాయ్. ఇప్పటివరకూ కింగ్ ఖాన్ షారూక్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం ఇప్పటికే రూ.200 కోట్ల మేర బడ్జెట్ పెట్టారట. అయితే అంత మొత్తం ఎలా వెనక్కి తెస్తారు?
కింగ్ ఖాన్ షారూక్ కెరీర్ బెస్ట్ వీఎఫ్ ఎక్స్ సినిమా రా-వన్ బడ్జెట్‌ని ఇప్పటికే `జీరో` చిత్రం క్రాస్ చేసింది. అయితే ఆ మేరకు కింగ్ ఖాన్ & టీమ్ పై ఒత్తిడి ఉంటుంది కదా? అన్న ప్రశ్నకు .. ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. బాద్ షా షారూక్ కి ఉన్న అసాధారణ బిజినెస్ స్కిల్స్, అతడి ఛరిష్మాటిక్ స్టైల్ కి 200కోట్ల బడ్జెట్ ని రీకవరి చేయడం ఒక లెక్కే కాదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రఖ్యాత క్రిటిక్ తరణ్ ఆదర్శ్ విశ్లేషణ ప్రకారం.. ``డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న రా-వన్ కే డిజిటల్ - శాటిలైట్ రూపంలో భారీ మొత్తం రాబట్టారు. ఆ సినిమా ఫ్లాపైనా డిజిటల్ - శాటిలైట్ రూపంలోనే సగం మొత్తం వెనక్కి తెచ్చేశారు. ఆనంద్ ఎల్.రాయ్ ట్రాక్ రికార్డు దృష్ట్యా జీరోపై భారీగా బిజినెస్ సాగే ఛాన్స్ ఉంది. చైనా మార్కెట్ ఆశావహంగా మారిన వేళ జీరో చిత్రం అక్కడా భారీ వసూళ్లు తేవడం పెద్దంత కష్టమేమీ కాదు`` అని విశ్లేషించారు.
అంతేకాదు.. జీరో చిత్రానికి ఇప్పటివరకూ 200కోట్లు ఖర్చు చేస్తే, అందులో 130 కోట్లు వెనక్కి లాగేశారట. మెజారిటీ పార్ట్ కేవలం శాటిలైట్ రైట్స్ - డిజిటల్ - మ్యూజిక్ రైట్స్ - ఇన్ ఫిలిం బ్రాండింగ్ రూపంలోనే తిరిగి వెనక్కి వచ్చేసిందని చెబుతున్నారు. ఇప్పటికే శాటిలైట్ రైట్స్ ని ప్రతిష్ఠాత్మక సోని పిక్చర్స్ సొంతం చేసుకుంది. అలానే ప్రఖ్యాత ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ డిజిటల్ హక్కులు కైవశం చేసుకుంది. ఆ రెండిటి రూపంలోనే మెజారిటీ పార్ట్ బడ్జెట్ వెనక్కి వచ్చిందని చెబుతున్నారు. ఖాన్ దాదా సంబంధాలు మెయింటెయిన్ చేసే తీరే వేరు... అని విశ్లేషిస్తున్నారు. ఇక ఆనంద్.ఎల్.రాయ్ తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా `తను వెడ్స్ మను` బాక్సాఫీస్ వద్ద 150 కోట్లు వసూలు చేసింది. అలాంటిది షారూక్ లాంటి బిగ్ గన్ ని చేతిలో పెట్టుకుని 500కోట్ల బిజినెస్ సాగించడం కష్టమేమీ కాదని విశ్లేషిస్తున్నారు. జీరో చిత్రం వందల కోట్ల మేర బాక్సాఫీస్ వసూళ్లు తేవడం అంత కష్టమేమీ కాదన్న వాదనా వినిపిస్తోంది.