సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ శృంగారతారగా కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని షేక్ చేసిన బ్యూటీ షకీలా. ఆమె దాదాపు 250 సినిమాలలో నటించి తన సత్తా చూపించింది. గతంలో షకీలా స్టార్ హీరోలను సైతం తన సినిమాలతో అందచందాలతో ఢీ కొట్టింది. ఆ రోజుల్లోనే హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక స్టార్ షకీలా మాత్రమే అనడంలో సందేహం లేదు. లైఫ్ లో హీరోయిన్‌గా స్థిరపడాలనే ఆశలతో ఇండస్ట్రీకి వస్తే.. చివరికి శృంగారతారగా మిగిలిపోయింది. ఆమె ఎన్నోసార్లు తను శృంగారతారగా ఎందుకు మారిందో.. ఎలా మారిందో పలు ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడామె జీవిత కథ సినిమాగా రానుంది. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రిచా చద్దా.. షకీలా రోల్ పోషిస్తుంది. పాత్రలో పర్ఫెక్షన్ కోసం ఈ బయోపిక్‌లో నటిస్తున్న రిచా స్వయంగా షకీలాను కలిసి ఎన్నో విషయాలని అడిగి తెలుసుకుందట.
ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. ‘బయోపిక్‌కి సంబంధించి నేను దర్శకుడికి ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. నా కెరీర్, జీవితం గురించి ఉన్నది ఉన్నట్లుగా దర్శకుడికి చెప్పాను. నిజాలు దాచుకుంటే.. ఇక బయోపిక్ తీయడమెందుకు..? ఇందులో సౌత్ ఇండియన్ స్టార్ హీరోల బాగోతాలు, రాసలీలలు, అసలు విషయాలు బయటపడతాయి. ఇక రిచాకి నాకు ఫిజికల్ సిమిలారిటి ఉంది. అంతేకాకుండా ఆలోచన విధానం కూడా మా ఇద్దరిదీ ఒకలానే ఉంటుంది. నా పాత్రని అర్థం చేసుకుని నటించగల నటి అని నేను నమ్ముతున్నా’ అని షకీలా వెల్లడించింది. ఈ చిత్రంలో షకీలా కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తుండటం మరో విశేషం. మలయాళ నటుడు రాజీవ్ పిళ్లై షకీలా ప్రేమికుడు అర్జున్ పాత్రలో కనిపించనున్నారు. హిందీ, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కానీ ఈ బయోపిక్ ప్రస్తుతం ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.