బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ నటి విద్యాబాలన్ నటించిన 'శకుంతలా దేవి'. మానవ కంప్యూటర్ గా ప్రసిద్ధి చెందిన మాథెమేటిషియన్ శకుంతల దేవి జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్ రూపొందించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన శకుంతలదేవి బయోపిక్ ట్రైలర్ తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. శకుంతల దేవి పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయిందని చెప్పాలి. ఇక రెండు నిముషాల నలభై సెకండ్స్ ఉన్న చిత్రం ట్రైలర్ ఓ వైపు ఆద్యంతం వినోదాత్మకంగా.. మరోవైపు భావోద్వేగంగాను ఉంది. ఎంతో సరదాగా విద్యాబాలన్ శకుంతల దేవి పాత్రను నడిపిస్తూనే ఎమోషనల్ గా ఆలోచనలో పడేస్తోంది.
ఇందులో శకుంతలదేవి బాల్యం నుండి.. అంటే స్కూల్ వెళ్లే పీరియడ్ నుండి అంచెలంచెలుగా ఎదిగిన తీరును ఆకట్టుకునేలా ఆవిష్కరించారు దర్శకనిర్మాతలు. ట్రైలర్ చూస్తుంటే ఎక్కడ కూడా నిర్మాణ విలువలు తగ్గినట్లు కనిపించడం లేదు. ఈ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త జీవిత ప్రయాణంలో కుటుంబం, భర్త, పిల్లలు.. ఇలా అన్నీ అంశాలను మేళవించారు మేకర్స్. ఇక వినోదానికి మాత్రం కొదువలేదని తెలుస్తుంది. సరదాసరదాగా ఓ ఎమోషనల్.. ఓ ఇన్స్పిరేషనల్ జర్నీని జులై 31న అమెజాన్ ప్రైమ్ లో వీక్షించవచ్చు. ఇక అను మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్, విక్రమ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ పక్కా అని అంటున్నాయి సినీవర్గాలు. చూడాలి మరి హ్యూమన్ కంప్యూటర్ బయోపిక్ ఎలా ఆకట్టుకోనుందో..!Full View
ఇందులో శకుంతలదేవి బాల్యం నుండి.. అంటే స్కూల్ వెళ్లే పీరియడ్ నుండి అంచెలంచెలుగా ఎదిగిన తీరును ఆకట్టుకునేలా ఆవిష్కరించారు దర్శకనిర్మాతలు. ట్రైలర్ చూస్తుంటే ఎక్కడ కూడా నిర్మాణ విలువలు తగ్గినట్లు కనిపించడం లేదు. ఈ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త జీవిత ప్రయాణంలో కుటుంబం, భర్త, పిల్లలు.. ఇలా అన్నీ అంశాలను మేళవించారు మేకర్స్. ఇక వినోదానికి మాత్రం కొదువలేదని తెలుస్తుంది. సరదాసరదాగా ఓ ఎమోషనల్.. ఓ ఇన్స్పిరేషనల్ జర్నీని జులై 31న అమెజాన్ ప్రైమ్ లో వీక్షించవచ్చు. ఇక అను మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్, విక్రమ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ పక్కా అని అంటున్నాయి సినీవర్గాలు. చూడాలి మరి హ్యూమన్ కంప్యూటర్ బయోపిక్ ఎలా ఆకట్టుకోనుందో..!