లైంగిక వేధింపులపై అప్పుడెందుకు నోరు విప్ప లేదు..?

Update: 2022-09-17 04:54 GMT
'మీటూ' ఉద్యమం చిత్ర పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు సర్వసాధారణమంటూ అనేక మంది హీరోయిన్లు తమ అనుభవాలను వ్యక్తపరిచారు.

కొందరైతే ధైర్యంగా వాళ్ళ పేర్లను బహిరంగంగానే వెల్లడించి సంచలనం రేపారు. టాలీవుడ్ లో కూడా దీనిపై పెద్ద చర్చ జరిగింది. తాజాగా బాలీవుడ్ నటి షామా సికిందర్ తనకి ఎదురైన అనుభవం గురించి తెలిపింది.

ఇటీవల షామా ఓ ఇంటర్వ్యూలో నిర్మాతలు ఆఫర్స్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా తన నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించే వారని వెల్లడించింది. అందులో పరిశ్రమలో బాగా స్థిరపడిన నిర్మాతలు కూడా ఉన్నారని చెప్పింది. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా పరిశ్రమకే పరిమితం కాదని.. ప్రపంచంలో ఎక్కడైనా ఉందని పేర్కొంది.

"ఇటీవల కాలంలో ఇండస్ట్రీ చాలా మారిపోయింది. నేడు యువ నిర్మాతలు చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. నటీనటులను గౌరవంగా చూస్తారు. పని కోసం సెక్స్ అనే భావన వారికి లేదు. గతంలో నిర్మాతలు నాతో స్నేహం చేయాలనుకుంటున్నారని చెప్పేవారు''

''మనం కలిసి పని చేయకపోతే మనం స్నేహితులుగా ఎలా ఉండగలం అని నాకు అనిపించేది. పనికి ప్రతిగా సెక్స్ అడగడం అనేది ఇటీవలి కాలంలో చాలా తక్కువయిందని నేను భావిస్తున్నాను" అని షామా సికిందర్ తెలిపింది.

''నా ఉద్దేశ్యం ప్రకారం అలా చేయడానికి మీరు భయంకరమైన చేతకాని తనంలో ఉండి ఉండాలి. మీరు స్త్రీ హృదయాన్ని గెలుచుకోగలరన్న విశ్వాసం మీకు లేదని ఈ వేధింపులు నిరూపిస్తున్నాయి''

''కాస్టింగ్ కౌచ్ అనేది చిత్ర పరిశ్రమకే పరిమితం కాదు. ఇక్కడ బాలీవుడ్ ను మాత్రమే నిందించడం తప్పు. ఇది లైమ్ లైట్ లో ఉన్న పరిశ్రమ కాబట్టి ఎక్కువ ఫోకస్ అవుతోంది'' అని షామా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అయితే ఇండస్ట్రీలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్న షామా సికిందర్ లాంటి నటీమణులు.. కెరీర్ ఎండింగ్ లో ఉన్నపుడు లేదా ఆఫర్స్ తగ్గిపోయినప్పుడు మాత్రమే ఆ విషయాల గురించి మాట్లాడుతున్నారు. అదే కెరీర్ బూమ్ లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి.

చేతి నిండా అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయలేదు అని అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలు ఫేస్ చేస్తున్న లైంగిక వేదింఫులపై మీటూ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు కూడా నోరు విప్పని నటీమణులు.. కెరీర్ డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఇకపోతే యే మేరీ లైఫ్ హై - బాల్ వీర్ వంటి షోలతో పాపులర్ అయిన షామా సికిందర్.. తన ప్రియుడు జేమ్స్ మిల్లిరాన్ ని ప్రేమ పెళ్లి చేసుకుంది. 2015లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ ఏడాది ప్రారంభంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News