BiggBoss: చనిపోయిన ప్రియుడిని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది

Update: 2021-09-10 06:02 GMT
ఇండియన్ బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్ బాస్ అనేది ఒక వ్యసనంగా మారింది. ముఖ్యంగా హిందీ భాష లో బిగ్‌ బాస్‌ సుదీర్ఘ కాలంగా టీవీలో టెలికాస్ట్ అవుతూనే ఉంది. సీజన్ లకు సీజన్లు పూర్తి అవుతున్నా బిగ్‌ బాస్ అంటే ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ రాలేదు. పైగా క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి హిందీ బిగ్ బాస్ ను ఓటీటీ స్పెషల్ గా కూడా తీసుకు వస్తున్నారు. ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్న బిగ్ బాస్ కు కరణ్‌ జోహార్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. భారీ ఎత్తున వ్యూస్ ను దక్కించుకుంటున్న బిగ్‌ బాస్ ఓటీటీ స్పెషల్‌ లో బాలీవుడ్‌ తో పాటు పలు రకంగాల ప్రముఖులు ఉన్నారు. శిల్ప శెట్టి సోదరి షమిత శెట్టి కూడా అందులో ఒకరు. ఈ సీజన్ లో ఆమె ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తూ వచ్చింది. ఇన్నాళ్లు ఆమె చాలా స్ట్రాంగ్ గా అందరి కంటే యాక్టివ్ గా కనిపిస్తూ వచ్చింది. కాని తాజా ఎపిసోడ్‌ లో ఆమె తన చనిపోయిన ప్రియుడిని తల్చుకుని కన్నీరు పెట్టుకోవడం అందరిని కలచి వేసింది. మొదటి సారి ఆమె కన్నీరు పెట్టుకున్న విజువల్స్ ప్రేక్షకులకు కాస్త ఆవేదన కలిగించాయి.

తన మొదటి బాయ్ ఫ్రెండ్‌ కారు ప్రమాదంలో చనిపోయాడు అని తెలిసిన సమయంలో జీవితం అంతా చీకటి అన్నట్లుగా అనిపించింది. ఆ సమయంలో నేను డిప్రెషన్ కు వెళ్లి పోయాను అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇన్ని రోజులుగా తన వ్యక్తిగత విషయాలను చెప్పకుండా ఆటను ఆట అనుకుంటూ వచ్చిన షమిత తాజా ఎపిసోడ్స్ లో అన్ని విషయాలను ఇలా బరస్ట్ అవ్వడంతో ప్రేక్షకులు కూడా ఆమె పెయిన్‌ ను ఫీల్‌ అయ్యారు. ఆమె మనసులో ఎంతో బాధ ఉంటే తప్ప చెప్పదు కదా అన్నట్లుగా ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హౌస్‌ లో రాకేష్ బవత్‌ తో ఆమె సన్నిహితంగా ఉంటుంది. ఇద్దరు కలిసి పలు సందర్బాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చాలా మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

బాయ్ ఫ్రెండ్‌ విషయాన్ని రాకేష్‌ కు చెప్పడంతో అతడి నుండి ఓదార్పు లభించింది. ఒంటరిగా ఉన్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. అయితే కోవిడ్ లాక్‌ డౌన్ సమయంలో ఒంటరితనం ఫీల్ అయ్యాను. అలాగే తండ్రి మరణంను కూడా జీర్ణించుకోలేక పోయాను అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు అయినా కూడా ఇంకా నన్ను శిల్ప శెట్టి సోదరిగానే చూస్తున్నారు తప్ప నన్ను నన్నుగా చూడటం లేదు. అందుకే బిగ్‌ బాస్ లో ఎంట్రీ ఇచ్చి నా కంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకోవాలని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కోరుకున్నట్లుగానే ఇప్పుడు షమిత శెట్టికి ప్రత్యేక గుర్తింపు అయితే ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ పూర్తి అయ్యేప్పటికి ఆమెకు మంచి ఆధరణ దక్కడం అనేది ఖాయం.



Tags:    

Similar News