రోబో’కు సీక్వెల్ గా తెరకెక్కిన ‘2.ఓ’ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం సునాయాసంగా బడ్జెట్ ను రికవరీ చేయడంతో పాటు, నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చి పెట్టడం ఖాయంగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేయాలని ప్రతి ఒక్కరు అనుకున్నట్లుగానే శంకర్ కూడా ముందే ‘2.ఓ’ హిట్ అవుతుందని భావించి ‘3.ఓ’ ను రూపొందించాలని భావించినట్లున్నాడు.
2.ఓ చిత్రం ప్రమోషన్ సమయంలోనే 3.ఓ ఉంటుందని చిన్న హింట్ ఇచ్చాడు. తాజాగా 2.ఓ చిత్రం క్లైమాక్స్ లో ఆ విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. సినిమా పూర్తయ్యిందని భావిస్తున్న సమయంలో చిన్ని రోబోగా రజినీకాంత్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చాడు. 3.ఓ లో చిన్ని రోబో హీరోగా కనిపించే అవకాశం ఉందని అనిపిస్తోంది. త్వరలోనే ‘ఇండియన్ 2’ చిత్రాన్ని శంకర్ మొదలు పెట్టబోతున్నాడు. అందుకోసం ఏర్పాట్లు కూడా మొదలు పెట్టాడు. ఇండియన్ 2 తర్వాత 3.ఓ ను శంకర్ తెరకెక్కించే అవకాశాలున్నాయని అనిపిస్తుంది.
2.ఓ కు 550 కోట్లు ఖర్చు చేసినప్పుడు 3.ఓ కు అంతకు మించి ఖర్చు చేస్తేనే సినిమాకు ఏమైనా క్రేజ్ ఉంటుంది. అయితే అంత బడ్జెట్ అంటే మరోసారి నిర్మాతలు సాహసం చేస్తారా అనేది చూడాలి. మంచి కథ సెట్ అయితే శంకర్ తో ఎంత బడ్జెట్ పెట్టేందుకు అయినా కొందరు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. అందుకే 3.ఓ చిత్రం ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకైనా వచ్చే అవకాశం ఉంది. కాని 3.ఓ లో రజినీ కాంత్ ఉండేది లేనిది అనుమానమే. ఎందుకంటే రజినీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. దానికి తోడు ఆయన ఆరోగ్యం అంతగా సహకరించడం లేదు. కనుక 3.ఓ కు సూపర్ స్టార్ డౌటే. ఒకవేళ సూపర్ స్టార్ లేకుండానే 3.ఓను రూపొందించే సాహసం శంకర్ చేస్తాడా అనేది చూడాలి.