'భారతీయుడు' కథ ఇలా పుట్టిందట

Update: 2019-01-18 13:14 GMT
1996లో ఒక చిన్న చిత్రంగా తెరకెక్కి తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'భారతీయుడు' సినిమా తమిళంలోనే కాకుండా తెలుగు మరియు హిందీల్లో కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంది. దేశ వ్యాప్తంగా అప్పట్లో భారతీయుడు సంచలనం. ఆ చిత్రంలోని నేతాజీ పాత్రను యూత్‌ ఆదర్శంగా తీసుకున్నారు. లంచంపై పోరాడేందుకు యువతరం ముందుకు వచ్చారు. అప్పట్లో పెను సంచలనం సృష్టించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కబోతుంది. నేడు సినిమా షూటింగ్‌ లాంచనంగా ప్రారంభం అయ్యింది.

'ఇండియన్‌ 2' ప్రారంభోత్సవం సందర్బంగా దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ తన కాలేజ్‌ రోజుల్లో జరిగిన ఒక సంఘటన వల్ల తాను భారతీయుడు సినిమాను తీశానంటూ చెప్పుకొచ్చాడు. కాలేజ్‌ లో ఆదాయ - కుల దృవీకరణ పత్రాలు అడిగిన సమయంలో ప్రభుత్వ ఆఫీస్‌ కు తల్లిదండ్రులతో తాను వెళ్లాను. అక్కడ వారు వాటిని ఇచ్చేందుకు లంచం అడిగారు. ఆ సంఘటన నన్ను కదిలించింది. వారు చేయాల్సిన పనిని చేసేందుకు లంచం ఎందుకు ఇవ్వాలనిపించింది. అప్పటి ఆలోచన నుండి వచ్చిందే 'భారతీయుడు'.

భారతీయుడు సినిమాలో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా ఓల్డ్‌ మన్‌ పాత్ర ఉంటుందని ఫస్ట్‌ లుక్‌ తోనే తేలిపోయింది. ఇక సినిమా షూటింగ్‌ ప్రారంభం సందర్బంగా కూడా కమల్‌ ఓల్డ్‌ మన్‌ గెటప్‌ లోనే కనిపించాడు. తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కమల్‌ హాసన్‌ సినిమా మొత్తంలో కూడా ఇలాగే ఓల్డ్‌ గెటప్‌ లోనే కనిపిస్తాడని తెలుస్తోంది. భారతీయుడు సినిమాలో కమల్‌ తండ్రి - కొడుకులుగా కనిపించాడు. కాని ఈ సినిమాలో మాత్రం తండ్రి పాత్రలోనే కనిపిస్తాడు. కొడుకు పాత్ర మొదటి పార్ట్‌ లో మరణించిన విషయం తెల్సిందే. శంకర్‌ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌ గా నటించబోతుంది. వయసు పైబడిన మహిళగా కాజల్‌ కనిపించనున్నట్లుగా కూడా తెలుస్తోంది.

Tags:    

Similar News