15 నుంచి హైద‌రాబాద్ లోనే శంక‌ర్ మ‌కాం!

Update: 2021-11-12 14:33 GMT
ర‌క‌ర‌కాల వివాదాల‌ను ప‌రిష్క‌రించుకుని ఎట్ట‌కేల‌కు శంక‌ర్ తిరిగి షూటింగుకి రెడీ అవుతున్నారు. భార‌తీయుడు 2 త్వ‌ర‌లోనే ప్రారంభించాల్సి ఉంటుంద‌న్న కీల‌క స‌మాచారం వైర‌ల్ అవుతుండ‌గానే అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.సి 15 చిత్రీక‌ర‌ణ‌కు ఇప్పుడు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

ఇటీవ‌లే ఆర్.సి 15కి సంబంధించిన‌ మొద‌టి షెడ్యూల్ ని పూర్తి చేసిన శంక‌ర్ ఇప్పుడు రెండో షెడ్యూల్ ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. లేటెస్ట్ రిపోర్ట్ మేర‌కు.. ఈ నవంబర్ 15 నుంచి ఆర్.సి15 కొత్త షెడ్యూల్ ని ప్రారంభిస్తార‌ని తెలిసింది. అంతేకాదు ఈ షెడ్యూల్ ఆద్యంతం హైద‌రాబాద్ లోనే తెర‌కెక్క‌నుంది. దీంతో శంక‌ర్ టీమ్ హైద‌రాబాద్ లో మ‌కాం వేసుందుకు ప్రిప‌రేష‌న్ లో ఉంద‌ని స‌మాచారం.

శంక‌ర్ ప్ర‌స్తుత స‌న్నివేశంలో ఒకేసారి రెండు సినిమాల షెడ్యూల్స్ ని పూర్తి చేయాల్సి ఉంటుంద‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ఆర్.సి 15 షెడ్యూల్ ని పూర్తి చేస్తూనే అతడు భార‌తీయుడు 2 కి సంబంధించిన ప‌నుల్లోకి దిగుతారు. ప్ర‌భాస్ ఓ వైపు ఆదిపురుష్.. మ‌రోవైపు స‌లార్ చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసిన‌ట్టే శంక‌ర్ కూడా ఇరు చిత్రాల‌పైనా దృష్టి సారించాల్సి ఉంటుంద‌ని భావిస్తున్నారు. భార‌తీయుడు 2 చిత్రానికి లైకా సంస్థ పెట్టుబ‌డుల్ని స‌మ‌కూరుస్తుండ‌గా.. ఆర్.సి 15కి దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక భార‌తీయుడు 2 క‌థానాయిక కాజ‌ల్ ప్ర‌స్తుతం ఫ్రెగ్నెంట్ కావడంతో త‌న‌తో స‌న్నివేశాల్ని వాయిదా వేస్తారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. శంక‌ర్ కానీ కాజ‌ల్ కానీ దీనిపై స్పందించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News