బ్లాక్ చేసింది.. దీప్తి తో బ్రేకప్ గురించి షన్ను క్లారిటీ

Update: 2021-12-27 06:06 GMT
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ షన్ను తాజాగా ఇన్ స్టా గ్రామ్‌ లో తన అభిమానులు.. ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. వారితో కొద్ది సమయం సరదాగా ముచ్చటించాడు. ఆ సమయంలో ఎక్కువ శాతం మంది దీప్తి సునైనతో రిలేషన్ బాగానే ఉందా.. ఇంకా సిరితో టచ్ లో ఉన్నారా అంటూ రకరకాలుగా ప్రశ్నలు వచ్చాయి.

చాలా మంది దీప్తి సునైన తో షన్నూ రిలేషన్ షిప్ సరిగా లేదు అంటూ ప్రచారం చేస్తున్నారు. వారిద్దరి మద్య ఇప్పటి వరకు బిగ్‌ బాస్ తర్వాత మాటలు లేవు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీప్తి సునైన ఇప్పటికే షన్నూ ను బ్లాక్ చేసింది. ఇన్‌ స్టా గ్రామ్‌ లో ఇద్దరి మద్య ఉన్న రిలేషన్‌ కనెక్షన్‌ అయితే తెగి పోయింది. కాని రియల్‌ లైఫ్‌ లో ఆ కనెక్షన్ ఉందా అనే విషయమై చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా షన్నూ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.

అభిమానులతో చిట్‌ చాట్‌ సమయంలో షన్నూ మాట్లాడుతూ ప్రస్తుతానికి దీప్తి నన్ను సోషల్‌ మీడియాలో బ్లాక్ చేసింది. తను కోపం వచ్చినప్పుడు అలా చేస్తుంది. ఇదే ఫస్ట్‌ టైమ్‌ ఏమీ కాదు అన్నట్లుగా షన్నూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే హైదరాబాద్‌ వెళ్లి దీప్తి సునైనతో మాట్లాడుతాను అన్నట్లుగా షన్నూ చెప్పుకొచ్చాడు.

అంటే ఇప్పటి వరకు దీప్తి సునైనను షన్నూ కలిసింది లేదు అన్నట్లుగా ఆయన మాటలతో క్లారిటీ వచ్చింది. నాపై కోపం ఉన్నా కూడా నా కోసం చివరి వరకు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసిందని అన్నాడు. దీప్తి సునైన కు కాస్త టైమ్‌ ఇస్తాను.. ప్రతి ఒక్కరికి టైమ్ కావాలి... స్పెస్‌ కావాలి.. ఆ తర్వాత కలిసి మాట్లాడుతాను అన్నట్లుగా షన్నూ అన్నాడు.

దీప్తి నేను హౌస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా నెగిటివిటీ ని ఫేస్ చేసింది. తను బిగ్‌ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా నేను నెగిటివిటీని ఫేస్‌ చేశాను. కనుక ఆ విషయం నుండి బయటకు రావడానికి కాస్త సమయం పడుతుందనే అభిప్రాయంను షన్నూ వ్యక్తం చేశాడు.

నా చేతి మీద ఉన్న టాటూ మాదిరిగా జీవితాంతం కూడా దీప్తి పై ప్రేమ ఉంటుంది అన్నట్లుగా షన్నూ కాస్త ఎమోషనల్‌ గా మాట్లాడాడు. ప్రస్తుతానికి దీప్తి కోపంగా ఉన్నా కూడా ఖచ్చితంగా కలిసి మాట్లాడితే కూల్‌ అవుతుందనే నమ్మకంతో షన్నూ ఉన్నాడు. ఇక సిరి గురించి మాట్లాడుతూ తను మంచి స్నేహితురాలు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

తాను ఎక్కువగా ఆమెపైనే కోపం చూపించినట్లుగా ఒప్పుకున్నాడు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్‌ 5 వల్ల షన్నూ లవ్ బ్రేకప్ అయ్యింది అంటూ వస్తున్న వార్తలను ఆయన క్లారిటీ ఇచ్చాడు. బ్రేకప్‌ అయినట్లే కాని కాదు అన్నట్లుగా షన్నూ మాటలను బట్టి అర్థం అవుతోంది. అంటే ప్రస్తుతానికి దీప్తి కోపంతో షన్నూ తో మాట్లాడటం లేదు.

షన్నూ కూడా ఆమెకు కాస్త స్పేస్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో దూరంగా ఉన్నాడు. వైజాగ్‌ లో ఉన్న షన్నూ మరి కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్‌ లో దీప్తి ని కలిసి ఆమె తో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి ఆమె కన్విన్స్ అవ్వకుంటే.. అతడు చెప్పే మాటలకు మళ్లీ ప్రేమించక పోతే అప్పుడు ఇద్దరి మద్య బ్రేకప్ గురించిన వార్తలు నిజం అన్నట్లుగా మనం అనుకోవచ్చు.

మొత్తానికి బిగ్‌ బాస్ సీజన్ 5 రన్నర్ గా నిలవడంతో పాటు దీప్తి సునైన తో రిలేషన్ చెడిపోవడంకు కారణం ఎవరు అంటే షన్ను చెప్పే సమాధానం సిరి పేరు అనడంలో సందేహం లేదు. ఆయన అభిమానులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు.
Tags:    

Similar News