చాలామంది హీరోలు అయితే.. వారు ఏ ప్రాంతంకు చెందినవారో ఆ ప్రాంతానికే లాయల్ గా ఉంటారు. కాని హీరోయిన్ల విషయంలో మాత్రం అలా ఉండదు. వారు ఎక్కడి నుండి వచ్చినా కూడా.. వారికి ఎక్కడ పేరు వచ్చిందో దాని గురించే కాస్త ఎక్కువగా థింక్ చేస్తారు. అదిగో నిన్న జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలను చూస్తే అదే అర్ధమవుతుంది.
నిన్న మొత్తానికి వరుసగా మూడవసారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ట్రోఫీని టాలీవుడ్ టీమ్ సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ను కర్ణాటక్ బుల్డోజర్స్ పై నెగ్గి.. అఖిల్ కప్పును అందుకున్నాడు. అంతేకాకుండా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ కప్పును బహుకరించారు. అయితే ఈ మ్యాచ్ ను తిలకించి.. కర్ణాటక తరుపున ప్రచారం చేయడానికి.. ప్రణీత.. శాన్వి వంటి హీరోయిన్లు వచ్చారు. నిజానికి ప్రణీత కన్నడిగ అయినా కూడా తెలుగులోనే ఆమెకు బ్రేక్ వచ్చింది. కాని నిలబెట్టుకోలేకపోయింది. ఇక ముంబాయ్ కు చెందిన శాన్వి అయితే తెలుగులో ఫెయిల్ అయ్యింది కాని.. కర్ణాటకలోనే క్లిక్ అయ్యింది. అందుకే ఆ టీమ్ కు సపోర్టు ఇచ్చిందట.
అయితే విషయం ఏంటంటే.. అక్కడ స్టేడియంలో తెలుగు ఫ్యాన్స్ మధ్యన.. పైగా తెలుగు టీమ్ గెలిచింది.. ఈ భామలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక చాలా సతమతమయ్యారట. ఆ విషయాన్ని తమ సన్నిహితులతో పంచుకుంటూ.. అటూ కన్నడ ఇటు తెలుగు స్టార్ల మధ్యన ఇబ్బందిగానే ఉందంటూ కామెంట్ చేస్తున్నారట. అది సంగతి.