అవ‌కాశాలివ్వ‌లేదు! 'ల‌వ్ లీ' క‌న్నీటి క‌థ‌!!

Update: 2019-12-19 05:21 GMT
సినిమాల్లో అవ‌కాశాలు రాక‌పోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌డం అంత సులువేమీ కాదు. అన్ని ఉద్యోగాలు వ‌దులుకుని రంగుల ప్ర‌పంచంలో ప్ర‌వేశించాక‌.. ఇక్క‌డ ఆఫ‌ర్లు రాక‌పోతే ఉపాధి క‌రువైతే.. ఆ బాధ వ‌ర్ణ‌ణాతీతం. ఓవైపు సెల‌బ్రిటీ హోదా వెక్కిరిస్తుంది. దానికి కాపాడుకోవాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం. స‌రిగ్గా ఇదే పాయింట్ కొంద‌రు క‌థానాయిక‌ల్ని ప‌డుపు వృత్తిలోకి దించిన ఘ‌ట‌న‌లు ఎన్నో చూశాం. క‌మిట్ మెంట్లు.. మీటూ ఉద్య‌మాలు దీని ప‌ర్య‌వ‌సాన‌మే. అయితే ఇండ‌స్ట్రీలో దిగ‌జార‌లేక సాంప్ర‌దాయాన్ని విడ‌వ‌లేక కొద్దిమంది కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అలాంటి సెన్సిటివ్ గాళ్స్ ఒక్కోసారి ఊహించ‌ని విధంగా బ‌రస్ట్ అవుతుంటారు.

బ‌హుశా ఇది అలాంటి ఉద్వేగ‌మే. దానిని త‌ట్టుకోలేక వ‌ల‌వ‌లా క‌న్నీళ్లు వ‌చ్చేశాయి. అంతేనా వేదిక‌పై అంత‌మంది ముందు క‌న్నీళ్లు పెట్టుకుంటూ అవ‌కాశాలు కావాల‌ని అడిగేసింది స‌ద‌రు యువ‌నాయిక‌. ఏడాది కాలంగా ఉద్యోగం స‌ద్యోగం లేదు. అసలు అవ‌కాశాలే లేవు. నాకు అవ‌కాశాలివ్వండి... ఎంక‌రేజ్ చేయండి అంటూ ఆల్మోస్ట్ ప్రాధేయ‌ప‌డినంత ప‌ని చేసింది. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే.. ఇంకెవ‌రు `ల‌వ్ లీ` ఫేం శాన్వీ శ్రీ‌వ‌త్స‌వ‌.

మ‌హిళా ద‌ర్శ‌కురాలు బి.జ‌య ఈ క‌న్న‌డ బ్యూటీని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశారు. ఆది సాయికుమార్ స‌ర‌సన ల‌వ్ లీ అనే చిత్రంలో అవ‌కాశం ఇచ్చారు. ఆ సినిమా బాగానే ఆడింది. సుశాంత్ అడ్డా.. మంచు విష్ణు స‌ర‌స‌న రౌడీ అనే చిత్రాల్లో అవ‌కాశం అందుకుంది.  అయితే ఆ త‌ర్వాత‌నే ఈ అమ్మ‌డికి ఆశించినంత పెద్ద ఆఫ‌ర్లు ఏవీ రాలేదు. సెంటిమెంటు ఇండ‌స్ట్రీలో అందం ప్ర‌తిభ‌తో పాటు హిట్టు అవ‌స‌రం. ల‌క్ కూడా క‌లిసి రావాలి. శాన్వీకి ల‌క్ క‌లిసిరాక‌ అవ‌కాశాలు రాలేదు. అయితే ఇప్పుడు `అత‌డే శ్రీ‌మ‌న్నారాయ‌ణ` అనే చిత్రంలో అవ‌కాశం అందుకుంది. ర‌క్షిత్ శెట్టి క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌తో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ వేడుక‌లో ల‌వ్ లీ శాన్వీ కంట త‌డి పెట్ట‌డం అభిమానుల్ని ఎమోష‌న్ కి గురి చేసింది. త‌న‌కు టాలీవుడ్ లో అవ‌కాశాలు రాలేద‌ని ఓపెన‌యిన‌ శాన్వీ నిజాయితీకి మీడియా ప్ర‌శంస‌లు కురిపించింది. చాలా మంది క‌థానాయిక‌లు భేష‌జానికి పోయి స‌రైన క‌థ కుద‌ర‌లేద‌ని.. కాల్షీట్ల స‌మ‌స్య వ‌చ్చింద‌ని త‌ప్పించుకుంటారు. కానీ శాన్వి మ‌న‌సులో ఏదీ దాచుకోకుండా నిజాయితీగా వ్య‌వ‌హ‌రించిన వైనం ఆక‌ట్టుకుంది. ప్ర‌తిభ‌.. అందానికి కొద‌వేమీ లేని ఈ చాక్లెట్ బ్యూటీకి టాలీవుడ్ లో మ‌రిన్ని అవ‌కాశాలు రావాల‌ని కోరుకుందాం. ఒకే ఒక్క మెగా ఆఫ‌ర్ ఈ అమ్మ‌డి క‌న్నీటిని తుడిచే వీలుందేమో!!



Tags:    

Similar News