భలే భలే మగాడివోయ్ రూపంలో తెలుగు ఇండస్ట్రీకి 2015లో మరిచిపోలేని హిట్టొచ్చింది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లు చేజిక్కించుకుంది. దీంతో ఇతర పరిశ్రమలన్నీ ఆ సినిమాని రీమేక్ చేయడంపై దృష్టిపెట్టాయి. కన్నడ - తమిళం - హిందీ... ఇలా అన్ని భాషల నుంచీ ఫోన్లొచ్చాయి నిర్మాతలకి. అయితే నిర్మాతలు మాత్రం రైట్స్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ తాజాగా స్వయంగా కన్నడలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మరో నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తో కలిసి అల్లు అరవింద్ కన్నడలో భలే భలే మగాడివోయ్ ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ మొదలవ్వబోతోంది. అందులో హీరోయిన్ గా శాన్విని ఎంపిక చేసుకున్నారు. లవ్ లీతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది శాన్వి. ఇక్కడ మరికొన్నిసినిమాలు చేసినా ఆ తర్వాత కన్నడలో సెటిల్ అయిపోయింది. ఇప్పుడక్కడ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగులో లావణ్య త్రిపాఠి చేసిన భలే అమ్మాయి పాత్ర శాన్వికి కన్నడలో ఎలాంటి పేరు తీసుకొస్తుందో చూడాలి.