యాక్షన్.. థ్రిల్లర్.. క్రైమ్.. కామెడీ.. ఇలా ఎన్ని రకాల సినిమాలు వచ్చినా ఫ్యాంటసీకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. మాయలు మంత్రాలు అంటే జనాలు భలే ఇష్టపడతారు. కానీ ఇలాంటి జానపద కథలను సాంఘికాలకు మిక్స్ చేసి చూపించే ట్రెండ్ కూడా బాగానే ఆకట్టుకుంటోంది. అయితే.. ఆయా సినిమాలకు ఇప్పుడు గ్రాఫిక్స్ బలం కూడా తోడవడంతో.. మూవీస్ తీరు మారిపోయిందని చెప్పచ్చు.
శరభ అంటూ ఇప్పుడు ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆకాష్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కుర్రాడు కొత్తవాడు అయినా.. సినిమాపై నమ్మకంతో బాగానే ఖర్చు పెట్టేశారని.. తాజాగా రిలీజ్ చేసిన శరభ టీజర్ చూస్తే అర్ధమవుతుంది. అణువణువునా గ్రాఫిక్స్ ని మిక్స్ చేసి.. ఓ స్థాయిలో నడిపించేశారు. ఓ ఊరికి వచ్చిన కష్టాన్ని తీర్చే ధోరోదాత్తుడిగా హీరో కేరక్టర్ ఉంటే.. దేవుడికే దెయ్యం పట్టించాలనే దుష్టమైన ఆలోచన విలన్ పాత్ర ధారిది. మొత్తానికి కథ ఏంటో చెప్పీ చెప్పకుండా.. టీజర్ ను సూపర్బ్ గా కట్ చేశారు.
మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటి జయప్రద ఒకే ఒక్క షాట్ లో కనిపిస్తే.. మంత్ర శక్తులను ఎదురొడ్డి నిలిచే పాత్రలో హీరో కనిపించాడు. మిగిలిన క్యారెక్టర్స్ ను పెద్దగా పరిచయం చేయలేదు కానీ.. సినిమాపై విపరీతమైన ఆసక్తి కలిగించడంలో శరభ టీజర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. భూమిని నాశనం చేసేందుకు ప్రయత్నించే ఓ కొత్త విలన్ ను మట్టి కరిపించే పాత్రను హీరో బాగానే డీల్ చేసినట్లుగా కనిపిస్తోంది. అయితే.. ఎన్ని చెప్పుకున్నా ఈ టీజర్ కు అసలు సిసలైన అట్రాక్షన్ మాత్రం విజువల్ ఎఫెక్ట్సే.
Full View