పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' తో బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసు కున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మరో వైపు ప్రచార చిత్రాలతోనూ సినిమాకి ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమా స్థాయిని తగ్గించాయే తప్పపెంచినట్లు కనిపించలేదు.
దీంతో అవసరమైన రీ షూట్లు సైతం చేసి ఆదిపురుష్ ని అగ్ర స్థానంలో నిలబెట్టాలని దర్శకుడు ఓం రౌత్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే సినిమాలో వైఫల్యాల్ని సరి చేసుకునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇక ఈసినిమా కోసం డార్లింగ్ ఎంతగా శ్రమించారో చెప్పాల్సిన పనిలేదు. రాముడి పాత్ర కోసం శరీరంలో భారీమార్పులే చేసారు. లుక్ పరంగా చాలా రకాల ఛెంజెస్ తీసుకొచ్చారు.
'ఆదిపురుష్' అవతారంలో ఆద్యంతం మెప్పించాలంటే? అందుకు తగ్గట్టు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ట్రెయినర్స్ ఆధ్వర్యంలో మరింత షైన్ అయ్యాడు. ఇక సినిమాలో తన పాత్ర కోసం సైతం తానే హిందీ వెర్షన్ లో గాత్రం అందించే అవకాశం ఉందని అనుకున్నారతా. కానీ ప్రభాస్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. హిందీ వెర్షన్ డబ్బింగ్ ను శరద్ కేల్కర్ చెబుతున్నారు.
దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేసారు. 'రాముడి పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు ఓం రౌత్ సినిమా ప్రారంభమైన దగ్గరనుంచి రాముడి పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాలని ఆఫర్ చేసారు. ఆ అవకాశాన్ని నేను ఎలా వదులుకుంటాను. దీన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నాను' అని తెలిపారు.
హిందీ వెర్షన్ కి ప్రభాస్ వాయిస్ ఓవర్ సింక్ కాకపోవడంతోనే దర్శకుడు కేల్కర్ తో డబ్బింగ్ చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు వెర్షన్ కి మాత్రం యధావిధిగా ప్రభాస్ గాత్రాన్ని అందిస్తారు.
ఇప్పటి వరకూ ఆయన హీరోగా నటించిన అన్నిసినిమాలకు డార్లింగ్ నే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ అవుతాయి. ఈ నేపథ్యంలో ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పడం జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.