‘సర్దార్ గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తర్వాతి సినిమాను మొదలు పెట్టేసినపుడు ఆయన అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు. ‘సర్దార్’ చేదు జ్నాపకాల్ని తుడిచేస్తూ చకచకా సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తేవాలని పవన్ త్వరపడుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. సినిమా అనుకున్న సమయానికి మొదలవలేదు. ఇంతలోనే దర్శకుడు ఎస్.జె.సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. డాలీకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించినా.. ఆ మార్పు జరిగి కూడా నెల రోజులు గడిచిపోవడంతో.. అసలీ సినిమా ఉంటుందా లేదా అని సందేహిస్తున్నారు జనాలు.
ఐతే నిన్న పవన్ కళ్యాణ్ ను తన ఫాం హౌజ్ లో కలిసిన అనంతరం ఈ సినిమా గురించి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు నిర్మాత శరత్ మరార్. పవన్ తన ఫాం హౌజ్ లో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మరార్.. సినిమా గురించి డిస్కషన్స్ నడుస్తున్నట్లు.. అతి త్వరలో సినిమా మొదలవబోతున్నట్లు చెప్పాడు. ఉన్నట్లుండి తననీ ప్రాజెక్టులోకి తీసుకురావడంతో డాలీ.. స్క్రిప్టును అవగాహన చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటున్నట్లు.. తన టేస్టుకు తగ్గట్లు కొన్ని మార్పులు చేస్తున్నట్లు పవన్ సన్నిహితులు చెబుతున్నారు. ఇంకొన్ని రోజుల్లో స్క్రిప్టు ఫైనలైజ్ అయిపోతుందని.. జులై నెలాఖర్లోనే సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసేసి.. ఏడాది ఆఖర్లో త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టాలన్న యోచనలో పవన్ ఉన్నాడు.