సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మూవీ 'మహానటి'. ఈ మూవీలో జెమినీ గణేషన్ గా నటించి ఆ పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని ఆకట్టుకున్నారు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ ప్రస్తుతం 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించారు.
బాలీవుడ్ సోయగం మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తోంది. రొమాంటిక్ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. మద్రాస్ రెజీమెంట్ కి చెందిన లెఫ్టినెంట్ రామ్ కు సీతామహాలక్ష్మీకి మధ్య సాగే ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించారు.
రష్మీక నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. లెఫ్టినెంట్ రామ్ కు సీత రాసిన లెటర్ ఏంటీ? ..దాని వెనకున్న కథేంటి అన్నదే ఈ చిత్ర కథ. సినిమా రిలీజ్ కి మరో వారం రోజులు మాత్రమే సమయం వుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని హోరెత్తిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.
ఈ మూవీలో హీరో దుల్కర్ సల్మాన్ రాయల్ ఎన్ ఫల్ట్ ని ఉపయోగిస్తున్నాడని, ఇందు కోసం పాపులర్ మోటర్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ ఫీల్డ్ కంపనీతో టైఅప్ అయినట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రాయల్ ఎన్ ఫీల్డ్ 350 సీసీ బైక్ ని హీరో దుల్కర్ సల్మాన్ నడుపుతున్న కొత్త పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ట్రైలర్ లోనూ దుల్కర్ రాయల్ ఎన్ ఫీల్డ్ నడుపుతున్న విజువల్స్ పలు సన్నివేశాల్లో కనిపించాయి.
ఇదిలా వుంటే ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి ఈ మూవీకి ముందు శర్వానంద్ హీరోగా 'పడి పడి లేచే మనసు' మూవీని రూపొందించాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో హీరో శర్వా రెట్రో ట్రయంఫ్ బైక్ ని యూజ్ చేశాడు. యాక్సిడెంటల్ గా 'సీతా రామం'లో దుల్కర్ కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ 350 సీసీ బైక్ ని పెట్టారా? లేక పబ్లిసిటీ, రాయల్టీ వస్తుందని పెట్టారా? అన్నది ఇప్పది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.