సంక్రాంతి రేసులో ఒక్కో సినిమా రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. ఇప్పుడున్న అధికారిక లెక్కల ప్రకారం ఈసారి సంక్రాంతికి పోటీ బరిలో చాలా సినిమాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే నందమూరి హీరోలు బాలయ్య - ఎన్టీఆర్ కాపు కాచుకుని వెయిటింగ్. బాలయ్య జనవరి14వ తేదీ ఫిక్సయితే, ఎన్టీఆర్ అంతకంటే ముందే జనవరి 8వ తేదీన వచ్చేస్తున్నాడు. డిక్టేటర్ - నాన్నకు ప్రేమతో రిలీజ్ లకు తేదీలు కన్ఫమ్ అయ్యాయి. ఈలోగానే నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా రిలీజ్‌కి వస్తోంది. దాంతో పాటు మరిన్ని సినిమాలు క్యూలో ఉన్నాయి.
అయితే ఇంతమందితో సంక్రాంతి రేసులో పోటీపడేందుకు దూసుకొస్తున్నాడు శర్వానంద్. స్టార్ హీరోలు ముందున్నా.. తనకి భయం లేదని చెబుతున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రాజా టైటిల్ బాగా వర్కవుటవుతోంది శర్వాకి. రన్ రాజా రన్ పెద్ద కమర్షియల్ హిట్టు కాబట్టి దానికి కొనసాగింపుగా ఎక్స్‌ప్రెస్ రాజా అనే టైటిల్ పెట్టుకున్నాడు. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ నేరుగా నందమూరి నటసింహాల్ని ఢీకొట్టబోతోంది. మరి ఎక్స్ ప్రెస్ దూకుడు సింహాల జోరుని ఆపగలదా? లేదా? పోటీలో నెగ్గుకొస్తుందా? లేదా ? అన్నది వేచి చూడాల్సిందే.