అసలు ఎవ్వరూ తగ్గట్లేదు. అదేంటో మరి.. న్యూ ఇయర్ లో కొత్తగా బాక్సాఫీస్ ను ఎదుర్కోవాలి అనుకున్నారేమో కాని.. మన కుర్ర హీరోలందరూ సై అంటే సై అంటున్నారు. సంక్రాంతికి ఒక్కొరొక్కరూ దిగుతున్నారు అనుకుంటే.. ఒక్కసారే చాలామంది దిగిపోతున్నారు.
ఇప్పటికే జూ.ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో.. బాలయ్య డిక్టేటర్ సినిమాలతో రెడీగా ఉన్నాం అని చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ కాస్త అటూ ఇటూ ఉండటంతో.. నాగార్జున తన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను దించాలని చూస్తున్నారు. జనవరి 8 లేదా 14న ఈ సినిమా వచ్చే ఛాన్సుందట. ఇకపోతే 14న డిక్టేటర్ తో పాటు సునీల్ కృష్ణాష్టమి కూడా రిలీజ్ కు రెడీగా ఉందట. వీళ్లందరూ కాదన్నట్లు.. శర్వానంద్ కూడా తన ఎక్స్ ప్రెస్ రాజా సినిమాను అదే రోజున తెస్తున్నాడు. ఇక ఈ సినిమాల్లో ఏ ఒక్కరు డ్రాప్ అయినా కూడా 14 రీల్స్ వారు నానితో తీస్తున్న సినిమాను దించేస్తారట. అసలు ఒక్క సంక్రాంతికే ఇంత హైప్ ఏంటండీ బాబూ...
నిజానికి ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో సినిమాలు ఇలాగే రిలీజ్ అయ్యేవి. ఏకంగా చిరంజీవి - బాలయ్య - నాగార్జున - వెంకటేష్ లు ఒకే సీజన్ లో వచ్చేవారు. ఇప్పుడంటే బడ్జెట్ లు పెరిగిపోవడంతో మనోళ్ల పెద్దగా డేర్ చేయలేకపోతున్నారు. గ్యాప్ లేకపోతే రికవర్ చేసుకోలేక.. అలా సోలోగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. మరి శర్వానంద్ వంటి హీరోల సినిమాలకు బడ్జెట్ 6-8 కోట్లు వరకు మాత్రమే.. అందుకేనేమో రంగంలోకి దూకేస్తున్నారు.