‘మహానుభావుడు’లో అవి పంటి కింద రాళ్లే..

Update: 2017-09-30 10:35 GMT
ఈ శుక్రవారం రిలీజైన ‘మహానుభావుడు’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఐతే దసరా సీజన్లో వచ్చిన ‘జై లవకుశ’.. ‘స్పైడర్’లతో పోలిస్తే కంటెంట్ పరంగా బెటర్ గా ఉండటం ‘మహానుభావుడు’కు కలిసొచ్చింది. ఐతే ఇది ప్రత్యేకమైన సినిమానా అంటే అదేమీ కాదు. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ఫార్మాట్లోనే దీన్ని నడిపించాడు. ఓసీడీ ఫ్యాక్టర్ మినహాయిస్తే ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ఆ కాన్సెప్ట్ కూడా మనకు కొత్తే కానీ.. వేరే భాషల్లో దాని మీద సినిమాలొచ్చాయి. ఐతే ‘భలే భలే..’తో పోలికల సంగతి పక్కన పెట్టేస్తే.. ‘మహానుభావుడు’ లాంటి మంచి ఎంటర్టైనర్లో పంటి కింద రాళ్లలా తగిలే అంశాలు కొన్ని ఉన్నాయి.

ఎంత ఓసీడీ ఉన్న వాడైనప్పటికీ.. జ్వరం ఉన్న తల్లిని దగ్గరికి రానివ్వకపోవడం.. ఒక మనిషి ప్రాణాలు పోతుంటే కూడా ఓసీడీనే అతణ్ని డామినేట్ చేసి ప్రాణం కాపాడాలన్న ఆలోచనను పక్కన పెట్టేయడం లాజికల్ గా అనిపించవు. ఇలాంటి ఇల్లాజికల్ థింగ్స్ సినిమాలో ఇంకొన్ని ఉన్నాయి. చాలా సున్నితంగా పెరిగిన హీరో.. హీరోయిన్ వచ్చి కసి రగల్చగాడే ఎన్నో ఏళ్లుగా కుస్తీ సాధన చేస్తూ.. ఛాంపియన్ గా నిలుస్తున్న వాడిని మట్టి కరిపించేయడం అన్నది ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. కమర్షియల్ సినిమాల్లో ఇలాంటివి మామూలే అని కొట్టి పారేయొచ్చు కానీ.. ఇలాంటి అంశాల్లో కొంచెం లాజిక్ కు దగ్గరగా సన్నివేశాలు రూపొందిస్తే ప్రేక్షకుల్లో అసంతృప్తి తగ్గుతుంది. సినిమా మరింత బెటర్ గా తయారై మరింత మందిని మెప్పిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో రాజీ ఉండకూడదంతే.
Tags:    

Similar News