శర్వానంద్ మరో అయిదు రోజుల్లో 'జాను' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. జాను సినిమా సెట్స్ పై ఉండగానే శ్రీకారం చిత్రానికి శ్రీకారం చుట్టాడు శర్వా. ఆ సినిమాకు కిషోర్ బి దర్శకత్వం వహిస్తుండగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ లో చాలా కూల్ గా లుంగీ కట్టుకుని బుజాన టవల్ వేసుకుని పొలంలో చెప్పులు లేకుండా నడుస్తున్న లుక్ తో శర్వానంద్ ఆకట్టుకున్నాడు. ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఫస్ట్ లుక్ మొన్న విడుదల చేశారో లేదో అప్పుడే విడుదల తేదీని ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సినిమాను సమ్మర్ లో విడుదల చేస్తామంటూ చెప్పారు. కాని తేదీని మాత్రం చెప్పలేదు. ఫస్ట్ లుక్ వచ్చిన నాలుగు అయిదు రోజుల్లోనే విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 24వ తారీకున శ్రీకారం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటన వచ్చేసింది.
ఉన్నట్లుండి సినిమా విడుదల తేదీని ప్రకటించాల్సిన అవసరం ఏమై ఉంటుందా అని ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటీ అంటే వరుసగా మీడియం రేంజ్ సినిమాలన్నీ కూడా సమ్మర్ లో బాక్సాఫీస్ పై దాడి చేసేందుకు సిద్దం అవుతున్నాయి. ఇటీవలే 'వి'.. 'లవ్ స్టోరీ'.. 'సోలో బ్రతుకే సో బెటర్'.. 'క్రాక్' చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. సేఫ్ జోన్ లో పోటీ లేకుండా రావాలి అంటే ఇతర సినిమాలతో పోటీ ఉండవద్దు. అందుకే ఏప్రిల్ 24వ తేదీని ఎవరు బుక్ చేసుకోక ముందే శర్వా టీం బుక్ చేసి పెట్టేశారు.