ఫెస్టివల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ కి ఈ మధ్య మంచి కథలు వస్తున్నాయి. ఎన్ని కథలు వస్తున్నా కూడా శర్వా ఏ మాత్రం తొందరపడటం లేదు. కథ బావుంటేనే ఒకే చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా శర్వా గురించి ఓ రూమర్ వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ బయోపిక్ లో శర్వానంద్ ని ఫైనల్ చేశారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. యువ ఎన్టీఆర్ పాత్రకు ఈ కుర్ర హీరో అయితేనే బెటర్ అని చిత్ర యూనిట్ అనుకుంటోందట.
బాలకృష్ణ సొంత ప్రొడక్షన్ లో ఈ బయోపిక్ ని నిర్మిస్తున్నాడు. అంతే కాకుండా క్యారెక్టర్స్ ని కూడా ఆయనే ఫైనల్ చేయనున్నారు. శర్వానంద్ పై కూడా ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ యువ పాత్రను చేయడానికి అందుబాటులో చాలా మంది ఉన్నారు. నందమూరి ఫ్యామిలీలోనే కొంత మంది హీరోలు ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ వంటి హీరోలు సమర్ధవంతంగా ఆ పాత్రకు న్యాయం చేయగలరు. కానీ బాలయ్య టీమ్ శర్వానంద్ గురించి ఆలోచించడం ఏమిటో ఎవ్వరికి అర్ధం కావడం లేదు.
బాలయ్య నిర్ణయంతోనే టీమ్ నడుచుకుంటుంది కాబట్టి తారక్ లేదా కళ్యాణ్ రామ్ ని సెలెక్ట్ చేస్తే ఆయన కాదంటారా? పైగా ఎన్టీఆర్ బయోపిక్ కాబట్టి సినిమాలో నటించడానికి వారికి హక్కు ఉంది. ముఖ్యంగా తారక్ నటిస్తే సినిమా రేంజ్ కూడా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి బాలయ్య ఆలోచన ఎలా ఉందొ..?. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే!