చిన్న సినిమా అనుకుంటే.. అంత పెద్దది చేశాడు

Update: 2016-04-19 04:37 GMT
తాను ‘24’ సినిమాను తక్కువ బడ్జెట్లో ఓ చిన్న స్థాయి సినిమాగా చేయాలనుకున్నానని.. కానీ సూర్య స్వయంగా నిర్మాతగా మారి ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టి దీని స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడని అన్నాడు డైరెక్టర్ విక్రమ్ కుమార్.

‘‘ఈ కథను ఓకే చేయడంతో పాటు సూర్యనే ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించాడు. దీంతో 24 నేను అనుకున్న దానికంటే చాలా పెద్ద సినిమా అయింది. ఇందులో సూర్య చేసింది మూడు పాత్రలే. కానీ ఐదు రకాల గెటప్పుల్లో కనిపిస్తాడు. ఆత్రేయ క్యారెక్టర్లో సూర్య ఎంత బాగా నటించాడో మాటల్లో చెప్పలేను. రెహమాన్ గారితో పని చేయడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన మా సినిమాకు ఒప్పుకుని పని చేయడమే ఓ గొప్ప గౌరవం. రీరికార్డింగ్ అద్భుతంగా వచ్చింది. నాతో పాటు టాలెంటెడ్ టీమ్ ఉండటం వల్లే నేను మంచి సినిమాలు అందించగలుగుతున్నాను’’ అని విక్రమ్ చెప్పాడు.

‘24’కు మాటలు అందించిన శశాంక్ వెన్నెలకంటి మాట్లాడుతూ.. చాలామంది దర్శకులకు కొన్ని విషయాల్లో మాత్రమే కొత్త ఆలోచనలు వస్తాయని.. కానీ రొమాన్స్.. యాక్షన్.. కామెడీ.. ఇలా ప్రతి అంశంలోనూ కొత్త ఐడియాలు ఉన్న దర్శకుడు విక్రమ్ అని అన్నాడు. 13 బి - ఇష్క్.. మనం.. ఇలా తన ప్రతి కథా ఫ్రెష్ గా ఉంటుందని.. ఇప్పుడు ‘24’ కూడా మరో వైవిధ్యమైన కథతో తెరకెక్కిందని.. ఇలాంటి సినిమాకు తాను కూడా పని చేసినందుకు గర్వంగా ఉందని చెప్పాడు. రోబో సినిమాలో హీరో-విలన్ రెండు పాత్రలూ రజినీకాంతే చేశాడని.. ఆ తర్వాత మళ్లీ సూర్యకే ఆ ఘనత దక్కిందని.. సినిమా చూసి అన్ని వర్గాల ప్రేక్షకులూ మెస్మరైజ్ అవుతారని అన్నాడు.
Tags:    

Similar News