కూతురు ఎంత వెర్రి వెంగలప్పా అయినా ఆ తండ్రికి అపురూపమే. కొందరు చదువులో చురుకుగా ఉంటారు. కొందరు ఆటల్లో ఉంటారు. చదువురాని వారంతా సుంటలు అనడానికి వీల్లేదు. పెద్దగా చదువురాని సచిన్ టెండూల్కర్ ప్రపంచం గర్వించే క్రికెటర్ కాలేదా?
ఈ కోవలోనే అప్పట్లో అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రాంకు వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అభాసుపాలైంది. ‘హనుమంతుడు ఎవరికోసం సంజీవనని తీసుకువచ్చారని’ అమితాబ్ అడగ్గా.. సోనాక్షి సిన్హా సమాధానం చెప్పలేక పోయింది. దీనిపై నెటిజన్లు ఆమెను ఓ ఆట ఆడుకున్నారు. రామాయణం తెలియని సోనాక్షి పై నిప్పులు చెరిగారు.
తాజాగా సోనాక్షి అపరిపక్వతను ఎత్తి చూపుతూ ముఖేష్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. ఆమెకు కనీస పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు.
దీనిపై సీరియస్ అయిన సోనాక్షి సిన్హా తండ్రి - ప్రముఖ బాలీవుడ్ లెజెండ్ హీరో శత్రుఘ్న సిన్హా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముఖేష్ ను పరోక్షంగా ఉతికి ఆరేశాడు.. ‘రామాయణం ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పకపోవడం ఎవరికో సమస్యగా ఉందని.. ఆయనేమైనా రామాయణం నిపుణుడా? హిందుమతం సంరక్షకుడా’ అంటూ శత్రుఘ్న కడిగిపారేశాడు. సోనాక్షి సహా నా ముగ్గురు పిల్లలకు తండ్రి అయినందుకు గర్విస్తున్నానని శత్రుఘ్న తెలిపారు. సోనాక్షి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సొంత కాళ్ల పై ఎదిగిందని.. అలాంటి కుమార్తె ఉన్నందుకు తను గర్వ పడుతున్నానని తెలిపారు. ముఖేష్ నుంచి తన కూతురుకు సర్టిఫికెట్ అవసరం లేదని విమర్శించారు.