చాలా మంది దర్శకులు కథానాయికల గ్లామర్ ని మాత్రమే చూడరు. వారిలో ప్రతిభను సునిశితంగా పరిశీలిస్తారు. ఎంపిక చేసుకున్న కంటెంట్ కి తగ్గట్టు హావభావాల్ని కనబరచగలరా లేదా? నటనలో సమర్థత ఎంత? అన్నది ప్రధానంగా పరిశీలిస్తారు. భాష వేషం సెన్సిబిలిటీస్ యాటిట్యూడ్ నటనాభినయం నిజాయితీ కమిట్ మెంట్.. ఇలా అన్ని కోణాల్లోనూ పరిశీలించాకే కథానాయికను ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇటీవల బుట్టబొమ్మ పూజా హెగ్డేకి అలాంటి దర్శకుడు తగిలారట. ఆ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు.
నిజానికి హాస్యం పండించాల్సిన పాత్రలో తనను ఎంపిక చేసేముందు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తనను సందేహించారని పూజా హెగ్డే తెలిపింది. భాషను అర్థం చేసుకుని కన్వే చేసేలా నటించగలదా లేదా? హాస్యం తనతో వర్కవుట్ అవుతుందా లేదా? అని ఆయన సందేహించారట.
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంలో చక్కని కామెడీ ఉంది. డైలాగ్ ల విషయంలో సహజత్వం అవసరం కాబట్టి అలాంటివాటిలో పూజా ఎంతవరకూ మెప్పించగలదు? తనకు భాష పరమైన సమస్య ఉంటుంది కదా! అని దర్శకుడు సందేహాన్ని వ్యక్తం చేశారట. దీనికి విరుద్ధంగా పూజా హెగ్డే వెంటనే తెలుగును పరిపూర్ణంగా నేర్చుకుని పెద్ద షాకిచ్చింది.
ఇప్పుడు భాస్కర్ తనకు అద్భుతమైన నటి అంటూ కితాబిచ్చేశారంటే అర్థం చేసుకోవచ్చు.. తనని ఇంప్రస్ చేసేందుకు బుట్టబొమ్మ చాలానే పరితపించిందని తన మాటల్ని బట్టి అర్థమవుతోంది. నిజానికి నాకు భయాలు ఉన్నప్పటికీ పూజా నటన చూసిన తర్వాత కన్విన్స్ అయ్యానని తాను చేయగలదని నమ్మకం కలిగాక ఉపశమనం లభించిందని భాస్కర్ తెలిపారు.
గీతా ఆర్ట్స్ లో ఇదే తనకు తొలి అవకాశం.. కొత్తే కదా! అన్నదానికి ఆయన సమాధానమిచ్చారు. కలిసి పనిచేయడం మొదటిసారి అయినా కానీ బాస్ అరవింద్ తో చాలా కాలంగా సాన్నిహిత్యం ఉంది. అల్లు అరవింద్ గారిపై నాకు చాలా గౌరవం ఉంది. బన్నీ వాస్ తో మంచి స్నేహం ఉందని ఆయన చెప్పారు.
అఖిల్ - పూజా జంటగా నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` ఓటీటీలో వస్తుందన్న ప్రచారం సరికాదు. ఇది థియేటర్లలో రిలీజయ్యాకే ఓటీటీలో రిలీజ్ చేస్తారని తెలిసింది. ఇక ఈ మూవీ పోస్టర్లు టీజర్ చూశాక.. పూజా- అఖిల్ జంట రొమాన్స్ మరో లెవల్లో వర్కవుట్ అయ్యిందని అర్థమైంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. ఈ చిత్రంలో కొన్ని సీన్లు మైండ్ బ్లాక్ చేసేలా వర్కవుటయ్యాయన్న గుసగుసలు వినిపించాయి. చిత్రీకరణ ముగింపులో భాస్కర్ కొన్ని రీషూట్లను చేశారన్న టాక్ కూడా వినిపించింది. మహమ్మారీ వల్ల రిలీజ్ ఆలస్యమైంది. తొందర్లోనే తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది.