శీలవతిని నేరుగా వదిలేశారే

Update: 2019-03-07 04:13 GMT
గత కొంత కాలంగా సెన్సార్ చిక్కుల్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నిన్నటి తరం శృంగార తార షకీలా 250 సినిమా శీలవతిని థియేటర్లలో కాకుండా నేరుగా యుట్యూబ్ లో రిలీజ్ చేసేశారు. కేవలం 90 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ తో క్లియరెన్స్ ఇచ్చింది. అయినా కూడా ఇది హాళ్ల దాకా వచ్చిన దాఖలాలు లేవు. ఓ ప్రముఖ ఛానల్ ద్వారా అందుబాటులోకి వచ్చిన శీలవతికి కొన్ని గంటల్లోనే వ్యూస్ అర లక్ష వైపు పరుగులు పెట్టడం గమనార్హం.

కాస్టింగ్ కౌచ్ తో పాటు పరిశ్రమకు సంబంధించిన కొన్ని అంశాలను టచ్ చేస్తూ దర్శకుడు సాయి రామ్ దాసరి ఈ శీలవతిని తీశారు. గతంలో ఓ వివాదాస్పద చిత్రంతో పాటు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వర్మ మీద నెగటివ్ కామెంట్స్ చేసింది కూడా ఇతనే.

ఇక శీలవతి విషయనికి వస్తే మేకింగ్ తో సహా ఎక్కడా క్వాలిటీ కనిపించదు. షార్ట్ ఫిల్మ్ తరహాలో ఇంకా చెప్పాలంటే అంత కన్నా తక్కువ స్టాండర్డ్స్ లో రూపొందించిన ఈ శీలవతిని బహుశా ఈ కారణంగానే థియేటర్లలో విడుదల చేసేందుకు బయ్యర్లు ముందుకు రాలేదేమో. ఒకప్పుడు యూత్ కు తన భారీ అందాల విందుతో నిద్ర లేని రాత్రుళ్లను కానుకగా ఇచ్చిన షకీలా తప్ప ఇందులో అందరూ బి గ్రేడ్ ఆర్టిస్టులే ఉన్నారు. పోనీ షకీలా కోసమైనా చూద్దాం అనుకుంటే వయసు దృష్ట్యా ఆవిడను సినిమా మొత్తం భరించడం కష్టమే.

గంటన్నర మాత్రమే ఉంది కాబట్టి సరిపోయింది. అదే ఏ రెండు గంటల నిడివో అయితే భరించడం కష్టమే. సెన్సార్ వాళ్ళ కట్స్ లో మిగిలింది ఎగిరిపోయిందో లేక ఇంతే తీశారో తెలియదు కాని మాజీ శృంగార తార 250వ సినిమా ఇలా కావడం ఆశ్చర్యకరమే. అన్నట్టు షకీలా బయోపిక్ నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే.


Full View

Tags:    

Similar News