సీనియర్ హీరో, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''శేఖర్''. 'మ్యాన్ విత్ ది స్కార్' (మచ్చల మనిషి) అనేది దీనికి ట్యాగ్ లైన్. జీవిత రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.
అరకులో వృద్ధ దంపతుల దారుణ హత్యకు గురవ్వగా.. ఈ కేసుని ఛేదించడానికి రిజైన్ చేసి వెళ్లిపోయిన పోలీసాఫీసర్ శేఖర్ ని రంగంలోకి దించినట్లు ఫస్ట్ గ్లిమ్స్ లో చూపించారు. వయసు మీద పడిన వ్యక్తిగా సిగరెట్ తాగుతూ బైక్ మీద వస్తున్న రాజశేఖర్ ఆకట్టుకుంటున్నాడు. తెల్లటి గెడ్డంలో రఫ్ గా సరికొత్తగా కనిపించారు.
'వాడు ఎప్పుడైనా ఒకరు చెప్పింది చేశాడా.. చేసిది చెప్పాడా' అంటూ ఇందులో అతని పాత్ర స్వభావాన్ని తెలియజేశారు. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. దీనికి అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్య సంగీతం అలరించింది. 'శేఖర్' సినిమా రాజశేఖర్ కెరీర్ లో మరో వైవిధ్యమైన పాత్ర అని అర్థం అవుతోంది. ఇది మలయాళ సూపర్ హిట్ 'జోసెఫ్' చిత్రానికి తెలుగు రీమేక్ అని సమాచారం. అక్కడ జోజు జార్జ్ పోషించిన పాత్రలో రాజశేఖర్ నటిస్తున్నారు.
నగరంలో సంచలనం రేపిన ఓ క్రిమినల్ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన శేఖర్ కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యారమేది గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇది రాజశేఖర్ కెరీర్ లో 91వ చిత్రం. ఆత్మీయ రాజన్ - ముస్కాన్ - అభినవ్ గోమటం - కన్నడ కిషోర్ - సమీర్ - భరణి - రవివర్మ - శ్రవణ్ రాఘవేంద్ర ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నార
''శేఖర్'' చిత్రాన్ని వంకాయలపాటి మురళీ కృష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్పొరేషన్ - సుధాకర్ ఇంపెక్స్ ఐపియల్ - త్రిపురా క్రియేషన్స్ - టారాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బీరం సుధాకర్ రెడ్డి - శివాని రాజశేఖర్ - శివాత్మిక రాజశేఖర్ - బొగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మల్లిఖార్జున నారగాని ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. లక్ష్మీ భూపాల రచనా సహకారం చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
Full View