అవకాశం దొరికితే వాడేసుకోవాలి.. మరి వాడుకోకపోతే ఎలా? వేల ధియేటర్లు కావాలంటే కష్టం కాని.. మన టార్గెట్ వెయ్యి లోపే అయితే.. మనకు రిలీజ్ డేట్ ముఖ్యమైతే.. సరిగ్గా ఇలా ఆలోచిస్తున్న ఇద్దరికి ఓ డేటు దొరికేసింది. అందుకే ఆ షేర్ పంజా విసిరితే.. వీళ్ళు పక్కనే కంచె వేశారు.
అఖిల్ సినిమా అక్టోబర్ 22న రావట్లేదు. సో.. ఆ రోజు రాకపోతే మరి దసరా పండక్కి మనకి కొత్త సినిమా లేనట్టే. అప్పటికే రిలీజ్ అయిన బ్రూస్ లీ, రుద్రమదేవి సినిమాలనే మనం చూస్కోవాలి. కాని అంత పెద్ద డేట్ ను ఖాళీగా వదిలేస్తారేటండీ? అందుకే వెంటే మెగా హీరో వరుణ్ తేజ్ తన ''కంచె''తో రంగంలోకి దిగితే.. పక్కనే మన నందమూరి కళ్యాణ్ రామ్ ''షేర్''తో సీన్ లోకి వస్తున్నాడు. ఒకవేళ షేర్ సినిమా అత్యంత మెజారిటీ ధియేటర్లలో రిలీజైనా కూడా.. కంచె కు కూడా కావల్సినన్ని ధియేటర్లు దొరకుతాయిలే. పైగా అఖిల్ కోసం ఎగ్రిమెంట్ చేసుకొని వదిలేసుకున్న ధియేటర్లన్నీ ఇప్పుడు ఈ రెండు సినిమాలనే వేసుకోవాలి మరి. లక్ కలిసొస్తే అంతే.. వెంటనే కిక్కొస్తుంది.