అడివి శేష్ నటిస్తున్న `మేజర్` పాన్ ఇండియా కథాంశంతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం హిందీ- తెలుగు- మలయాళ భాషల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదల కానుంది. ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవన ప్రయాణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభరితంగా తెరపై చూపించనున్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను తెరపై చూసే వీలుంది.
సయీ మంజ్రేకర్- శోభితా ధూలిపాళ- ప్రకాష్ రాజ్- రేవతి- మురళి శర్మ ఇందులో ప్రధాన తారాగణం. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు GMB ఎంటర్ టైన్మెంట్ - A + S సినిమాస్ సహకారంతో నిర్మిస్తోంది. శేష్ ఈ చిత్రానికి కథ-కథనం అందించారు.
కెరీర్ లో ఉత్తమ దశను ఆస్వాధిస్తున్న అడివి శేష్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో బాలీవుడ్ లో ప్రవేశించడం ఆసక్తిని కలిగిస్తోంది. మేజర్ ను జూలై 2 న హిందీ- తెలుగు- మలయాళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ మొదట్లో ప్లాన్ చేశారు. అయితే సెకండ్ వేవ్ కారణంగా వారు ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఎంతో పరిశోధించాకే ముందడుగు..!
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథలో నటించే క్రమంలో అతడి జీవితంపై శేష్ విస్తృతమైన పరిశోధనలు చేశాడు. అతను సినిమా చేయడానికి సందీప్ తల్లిదండ్రుల నుండి అనుమతి కోరాడు. ఈ చిత్రం కోసం వారి ఇన్ పుట్స్ ని కూడా తీసుకున్నాడు. అయితే సందీప్ తల్లిదండ్రులు మొదట్లో విముఖత చూపారని తెలిసింది. కానీ తరువాత ఆదివి శేష్ తో కలిసి ఈ చిత్రాన్ని పూర్తి జీవం వచ్చేలా విశ్వసించేలా సహకారం అందించారు. సందీప్ తల్లి పుట్టినరోజున ట్విట్టర్ లో శేష్ తమకు సహకరించిన వారి కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందించారని తెలిపారు.
``నన్ను నమ్మి మీ కుమారుడు సందీప్ పాత్రలో నటించేందుకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. `మేజర్`గా నటిస్తున్నందుకు నాకు గౌరవం ఉంది`` అని అడిష్ శేష్ థాంక్స్ చెప్పారు. ట్విట్టర్ లో సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు.
చివరి షెడ్యూల్:
తాజా సమాచారం మేరకు `మేజర్` షూటింగ్ చివరి దశలో ఉంది. శరవేగంగా పెండింగ్ షెడ్యూల్ ని పూర్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మేకర్స్ వారి విడుదల తేదీని ప్రకటిస్తారు. ఇది బహుభాషల్లో అత్యంత భారీగా రిలీజ్ కానుంది. ఇక మేజర్ చిత్రానికి బాలీవుడ్ చిత్రం `ఊరి` స్ఫూర్తి. విక్కీ కౌశల్ నటించిన ఊరి బార్డర్ తీవ్రవాదం రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కి అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసినదే. మేజర్ చిత్రాన్ని అంతే గ్రిప్పింగ్ గా రూపొందించేందుకు శేష్ అద్భుతమైన కథనాన్ని అందించారని తెలిసింది.