ఇలా కేసులు పెట్టడం ప్లస్సా? మైనస్సా?

Update: 2018-04-19 14:22 GMT
పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి పెద్ద బూతు తిట్టడం.. ఆ తర్వాతి పరిణమాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఏ ఒక్కరు ఈ అంశాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులు జనాల్లోనే కాదు.. ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. వీరిలో యాక్టర్ శివబాలాజీ కూడా ఒకడు. కాటమరాయుడు చిత్రంలో పవన్ కు తమ్ముడుగా నటించిన శివబాలాజీ.. ఇప్పుడు ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫార్మాట్ ప్రకారం కంప్లెయింట్ చేసిన శివ బాలాజీ..  తాను ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో ఓ మహిళ.. తనకు రోల్ మోడల్ అయిన పవన్ కళ్యాణ్ ను అసభ్య పదజాలంతో దూషించడం.. అనుచిత సంజ్ఞలు చేయడం ద్వారా అవమానించందని.. ఈ చర్య ద్వారా తనలాంటి చాలామంది మనోవేదనకు గురయ్యారని.. పవన్ ఫ్యాన్స్ లో అశాంతిని నింపేలా ఈ మాటలు ఉన్నాయంటూ.. ఆమెపై చర్యలు తీసుకోవాలని కంప్లెయింట్ చేశారు శివబాలాజీ.

అయితే.. ఒక నటుడిని ఒక పెద్ద తిట్టు తిట్టినందుకు ఇలా ఇండస్ట్రీ జనాలు కదిలి రావడం మంచి అంశమే. తామేమీ చూస్తూ ఊరుకోబోమని కేసులు పెట్టే వరకు వ్యవహారం వచ్చింది అంటే అదొక పాజిటివ్ పరిణామమే. తాము అభిమానించే వ్యక్తులను ఎవరేమన్నా ఊరుకోబోమని ఇలా డైరక్టుగా మెసేజ్ ఇస్తున్నారు. కాని ఇలా కేసులు పెట్టడం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో మాత్రం చెప్పలేం. నిజంగా శ్రీరెడ్డి శిక్ష పడితే.. అప్పుడు వీరు పెట్టిన కేసులకు విలువ ఉంటుంది.

ఇకపోతే శ్రీరెడ్డి తాను చేస్తున్న పోరాటం క్యాస్టింగ్ కౌచ్ గురించి అని చెబుతోంది. వర్మ స్టైల్ డైరెక్షన్ కారణంగా ఇప్పుడు ఏదో జరిగిపోయి కేసులు పెట్టేవరకూ వచ్చింది. మరోవైపు ఇలా కేసులు పెట్టినంత మాత్రాన.. వీరేమీ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న మహానుభావులు కాదంటూ ఆమె కామెంట్లు చేస్తోంది. అలా చూస్తే.. కేసులు పెడుతున్న ఈ సెలబ్రిటీలు అందరూ.. మరి క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఎందుకు సైలంట్ గా ఉన్నారు? ఆ యాంగిల్లో వారు కేవలం పవన్ ను తిడితేనే స్పందిస్తారు కాని.. ఇతరత్రా కామ్ గా ఉంటారని వారిపై నెగెటివ్ ముద్ర పడుతోంది. అలా అది మైనస్ అనమాట.

ఒకవైపు ఇండస్ట్రీని అవమానించేవాళ్లను వ్యతిరేకిస్తూ.. మళ్లీ అంతర్గతంగా ఉన్న క్యాస్టింగ్ కౌచ్ వంటి అంశాలను కడిగేయడం కాస్త క్లిష్టమైన అంశమే. ఇది చాలా కేర్‌ ఫుల్ గా అందరూ ఆచితూచి స్పందించాల్సిన విషయమే.
Tags:    

Similar News