కొన్ని సినిమాలు సరైన కంటెంట్ వుంటేనే ఆడతాయి.. కొన్ని సినిమాలు కంటెంట్ వున్నా దాన్ని కరెక్ట్ గా కన్వే చేయలేకపోతే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తుంటాయి. ఇక కొన్ని సినిమాలు టైమింగ్ ని బట్టి థియేటర్లలో దూరిపోతూ అందిన కాడికి సర్దేస్తుంటాయి. ఇదే పంథాలో కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన తమిళ చిత్రం 'డాన్'. యంగ్ టాలెంటెడ్ శివకార్తికేయన్ హీరోగా నటించి లైకా ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించిన చిత్రమిది. సిబి చక్రవర్తి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది.
ఎస్. జె. సూర్య, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి అంటే మహేష నటించిన 'సర్కారు వారి పాట' చిత్రానికి ఒక్క రోజు గ్యాప్ తో విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఊహించని విధంగా ఆకట్టుకుంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులో ఈ మూవీని 'కాలేజీ డాన్' పేరుతో రిలీజ్ చేశారు. 'సర్కారు వారి పాట' కారణంగా ఈ మూవీకి పెద్దగా థియేటర్లు లభించలేదు. లిమిటెడ్ స్క్రీన్స్ లోనే ఈ మూవీని విడుదల చేశాయి.
అయితేనేం మౌత్ టాక్ సూపర్ అంటూ స్ప్రెడ్ కావడంతో ఈ చిత్రానికి యూత్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబడుతూ ఆశ్చర్యపరుస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో కలిపి 70 కోట్ల మేర వసూళ్లని రాబట్టిందంటే సినిమా ఏ స్థాయిలో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈమూవీ సెకండ్ వీక్ లోకి అడుగు పెట్టేసింది.
ఈ సందర్భంగా మన వాళ్లపై కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన సినిమాలు కొన్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోని విషయం తెలిసిందే. 'డాన్' ని చూసైనా కథల ఎంపిక, అందులో చేసిన జిమ్మిక్కులు మన వాళ్లలో మార్పులు తీసుకొస్తాయని భావిస్తున్నారు. ఇపక్పటికైనా చిన్న సినిమాల విషయంలో మన వాళ్లు రియలైజ్ అయి కొత్త కథలతో సినిమాలు చేస్తే అవి మినిమమ్ గ్యారెంటీ మూవీస్ గా ప్రేక్షకుల్ని అలరిస్తాని, అలాంటి చిత్రాలని చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని కామెంట్ లు చేస్తున్నారు.
కామెడీ, మినిమమ్ ఆడియన్స్ కి పచ్చే అంశాల మేళవింపుతో కాలేజీ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా 'డాన్' మూవీని రూపొందించారు. ఇదే ఇప్పడు యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో హీరో శివకార్తికేయన్ కు, లైకా ప్రొడక్షన్స్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఫలితంతో లైకాలోనూ భారీ చిత్రాల వైపు వెళ్లి చేతలు కాల్చుకోకూడదనే మార్పు మొదలైనా మొదలవ్వొచ్చు అని తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.