మజిలీ మూవీ చూసిన వారందరికి గుర్తుండిపోయే క్యారెక్టర్ శ్రావణి. రీల్ లో నాగచైతన్య భార్య పాత్రను పోషించిన సమంత.. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లుగా నటించటం ఒక ఎత్తు అయితే.. దాన్ని ప్రతిఒక్కరూ ఫీల్ అయ్యేలా డిజైన్ చేసిన క్రెడిట్ మాత్రం చిత్ర దర్శకుడు శివ నిర్వాణనే చెప్పాలి. విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన ఈ కుర్రాడు చెప్పిన రియల్ శ్రావణి మాట ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
రీల్ మీద కనిపించే శ్రావణిని చూసి.. చాలామంది ఇలాంటి అమ్మాయిలు ఉంటారా? అనుకోవటం ఖాయం. అయితే.. అలాంటి అమ్మాయి ఎక్కడో కాదు.. తన భార్యే అంటూ చెప్పే శివ మాటలు మరింత ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి.. తన భార్య గురించి చెబుతూ.. తను రీల్ శ్రావణి లాంటిదే అన్న మాటను చెప్పేశారు.
ఆ విషయాన్ని ఆయన మాటల్లో చూస్తే..
మాది ప్రేమ వివాహం కాదు. పెద్దలు కుదర్చిందే. నిన్ను కోరి మూవీ విడుదలయ్యే వరకూ పెళ్లి ఆలోచన లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు పెళ్లి అంటే.. ఎలాంటి ఇబ్బందులో తెలిసే చేసుకోలేదు. వారి అంచనాకు తగ్గట్లు మనం లేనప్పుడు పెళ్లి చేసుకోవటంతో ఉపయోగం లేదు. అందుకే.. నిన్ను కోరి రిలీజ్ అయి.. కాస్త కుదుట పడ్డానన్న భావన రాగానే మా నాన్నతో అమ్మాయిని చూడమన్నా.
పెళ్లికి వెళ్లిన అమ్మానాన్నలకు కొత్తవలసకు చెందిన ఒక అమ్మాయిని చూడటం.. వారికి నచ్చి పెళ్లి చూపులు పెట్టేశారు.
పెళ్లిచూపుల్లో అమ్మాయితో మాట్లాడటానికి వాళ్ల ఫాదర్ ఒప్పుకోలేదు. తర్వాత ఏమనుకున్నారో కానీ.. ఇంటికి పిలిచి.. మాట్లాడమన్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి.. టైమింగ్స్ గురించి.. కెరీర్ గురించి చెప్పా. పెళ్లి తర్వాత రెండు నెలలే తనతో ఉన్నా. మజిలీ ప్రాజెక్టు ఓకే కావటం.. తను ప్రెగ్నెంట్ కావటంతో వాళ్లింటికి వెళ్లిపోయింది.
పనిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయదు.నాకు నేనుగా ఫోన్ చేస్తేనే మాట్లాడుతుంది. నాలోని సెన్సిటివిటినీ ఇష్టపడుతుంది. నిన్నుకోరి కాకుండా రక్తచరిత్ర తీసి ఉంటే పెళ్లి చేసుకునేదాన్ని కాదని సరదగా అంటుంది. తన మాటలకు నేను.. నువ్వు శ్రావణి లాంటిదానివంటే.. మరి అన్షు ఎవరని ప్రశ్నిస్తుంది. తెలుసు కదా మజిలీ మూవీలో నాగచైతన్య లవ్వర్ క్యారెక్టర్. మజిలీ రిలీజ్ వేళలో కొడుకు పుట్టాడు. డెలివిరీ టైంలో లేకపోవటంతో టెన్షన్ పడింది. నేను వెళ్లి కొడుకును బాబును చూసి వచ్చేసి.. పనిలో మునిగిపోయా. నన్ను నా కంటే ఎక్కువగా తను సపోర్ట్ చేస్తుంది. శివ నిర్వాణ మాటల్ని చదువుతుంటే.. రీల్ శ్రావణి.. రియల్ శ్రావణిలా అనిపిస్తుంది కదా?