మూవీ ఆర్టిస్టు అసోషియేషన్(మా) ఎన్నికలు మరో అయిదు రోజుల్లో జరుగబోతున్నాయి. ఒక వైపు ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా ప్యానెల్ మరో వైపు సీనియర్ నరేష్ ప్యానల్ లు గెలుపు పై ధీమాగా ఉన్నారు. ఇప్పటికే ఒకసారి అధ్యక్షుడిగా పని చేసిన శివాజీ రాజా స్వచ్చందంగా తప్పుకుని మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని మొదటి నుండి నరేష్ ప్యానల్ మెంబర్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే నటీనటుల శ్రేయస్సు, మా అభివృద్ది కోసం తాను మళ్లీ పోటీ చేస్తున్నట్లుగా శివాజీ రాజా అంటున్నారు. మా ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మెగాస్టార్ మద్దతు కోసం అభ్యర్థులు వెళ్లడం జరుగుతూనే ఉంది. తాజాగా ఈసారి కూడా నిన్న నరేష్ ప్యానల్ మరియు నేడు శివాజీ ప్యానల్ మెంబర్స్ చిరంజీవిని కలవడం జరిగింది.
నరేష్ తో పాటు జీవిత రాజశేఖర్ లు మర్యాదపూర్వకంగా చిరంజీవిని కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. నేడు శివాజీ రాజా ప్యానల్ కూడా చిరంజీవిని కలిసిన నేపథ్యంలో మెగాస్టార్ సపోర్ట్ ఇద్దరిలో ఎవరికి దక్కనుంది అనేది చర్చనీయాంశం. చిరంజీవి బహిరంగంగా ఎవరికి మద్దతు తెలిపే అవకాశం లేదు. కాని ఆయన ఇండస్ట్రీలో ఉన్న తన వారికి ముందే ఎవరికి ఓటు వేయాలనేది సూచిస్తాడని వారంతా కూడా చిరంజీవి చెప్పిన వారికే ఓటు వేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరి చిరంజీవి గారు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.
శివాజీ రాజా ప్యానల్ లో మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వారు పలువురు ఉన్నారనే చర్చ జరుగుతుంది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని, చిరంజీవి మద్దతు నరేష్ ప్యానల్ కు ఉంటుందని మరికొందరు అంటున్నారు. చిరంజీవి ఎవరివైపు ఉంటారు, ఈనెల 10వ తారీకున జరుగబోతున్న మా ఎన్నికల్లో గెలుపు ఎవరిదో కాలమే నిర్ణయించాలి.