రామ్ కు ఐదున్నర.. ఓంకార్ కు ఒకటిన్నర

Update: 2015-10-01 13:30 GMT
రెండేళ్ల ముందు తెలుగులో శాటిలైట్ బిజినెస్ భలేగా ఉండేది. కొత్త సినిమాల కోసం ప్రముఖ ఛానెళ్లు తెగ పోటీ పడేవి. చిన్న సినిమాలకు కూడా డిమాండ్ బాగానే ఉండేది. దీంతో చాలామంది శాటిలైట్ మీద ఆశతోనే సినిమాలు తీసేవాళ్లు. కానీ రాను రానూ పరిస్థితి మారిపోయింది. ఛానెళ్లు సినిమాల కోసం పోటీ పడటం పోయి.. సినిమా వాళ్లే ఛానెళ్ల చుట్టూ తిరిగే పరిస్థితి. ఇప్పుడు కొంచెం పేరున్న సినిమాలకు కూడా శాటిలైట్ కావడం కష్టమవుతోంది. ఇలాంటి సమయంలో ఓ మోడరేట్ మూవీ, ఇంకో చిన్న సినిమా శాటిలైట్ రైట్స్ కు మంచి రేటు తెచ్చుకోవడం విశేషం.

శుక్రవారం  ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ సినిమా ‘శివమ్’ శాటిలైట్ రైట్స్ రూ.5.5 కోట్లు పలికినట్లు సమాచారం. ‘పండగ చేస్కో’తో రామ్ ఫామ్ లోకి వచ్చేయడం.. ‘శివమ్’ మీద అంతటా పాజిటివ్ బజ్ ఉండటంతో ఈ సినిమాకు మంచి రేటు పలికింది. రామ్ సినిమాల్లో శాటిలైట్ పరంగా ఇదే రికార్డు. మరోవైపు ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ‘రాజుగారి గది’ సినిమాకు కూడా మంచి రేటు వచ్చింది. ఈ సినిమాను మా టీవీ వాళ్లు రూ.1.6 కోట్లు పెట్టి కొనడం విశేషం. దర్శకుడిగా ఓంకార్ తొలి సినిమా ‘జీనియస్’ అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ ‘రాజుగారి గది’కి ఈ రేటు రావడం విశేషమే. ఐతే హార్రర్ కామెడీలకు టీవీల్లో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ రేటు పలికినట్లుంది.
Tags:    

Similar News