ప్రమోషన్ లతో పిచ్చెక్కించేస్తున్నారు

Update: 2015-09-26 11:30 GMT
ప్రమోషన్ సినిమాకు ఎంత ముఖ్యమో బాలీవుడ్ జనాలు ఎన్నో ఏళ్లుగా చాటి చెబుతూనే ఉన్నా.. మన వాళ్లు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడిప్పుడే అందరికీ ప్రమోషన్ మహత్యం బోధపడుతున్నట్లుంది. బాహుబలి - శ్రీమంతుడు సినిమాలకు చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్ వల్లే ఆ సినిమాలు అంచనాల్ని మించి వసూళ్లు సాధించాయి. ఆ సంగతి అర్థం చేసుకుని మిగతా దర్శక నిర్మాతలు, హీరోలు కూడా తమ సినిమాల్ని ఓ రేంజిలో ప్రమోట్ చేస్తున్నారు.

భలే భలే మగాడివోయ్ చిన్న సినిమానే అయినా ఓ స్టార్ హీరోకు చేసినట్లు భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు. అది బాగా పని చేసి.. తెలుగు రాష్ట్రాల్లో - అమెరికాలో సినిమాకు భారీ వసూళ్లు దక్కాయి. విడుదల తర్వాత కూడా ప్రమోషన్స్ అదరగొట్టేశారు. దీంతో మూడో వారంలోనూ భలే భలే వసూళ్లు దక్కుతున్నాయి. తాజాగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ విషయంలో దిల్ రాజు కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ముందు, తర్వాత ప్రమోషన్స్ తో అదరగొట్టేస్తున్నాడు.

మరోవైపు వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న ‘శివమ్’లోనూ ప్రమోషన్స్ గట్టిగా నడుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్ - రాశి ఖన్నా కలిసి బలపం కట్టుకు తిరిగేస్తున్నారు. ఇలా చేయడం వల్ల సినిమా బాగా జనాల్లో నాని.. పాజిటివ్ బజ్ నెలకొంటోంది. ఇంతకుముందు ఏదో మొక్కుబడిగా ప్రమోషన్ కానిచ్చేవారు కానీ..  ఇప్పుడు ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ తరహాలోనే కొంచెం బడ్జెట్ పక్కనబెట్టి మరీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి.
Tags:    

Similar News