అందాల పోటీల్లో అదరగొడితే ఆ కిక్కు వేరు. మాజీ మిస్సు గెలిచిన అందగత్తెకు కిరీటం అందజేస్తుంటే ఫోటోగ్రాఫర్ల క్లిక్స్ మధ్య తడిసి ముద్దవ్వడం గొప్ప మజానిస్తుంది. అలాంటి మజాను ఆస్వాధించాక రంగుల ప్రపంచంలోకి ఆహ్వానం కూడా చాలా సులువు. దర్శకనిర్మాతలు హీరోల కళ్లలో పడేందుకు ఇది రహదారి.
ఇదే సరైన దారి కూడా. ఈ కేటగిరీలోనే ఐశ్వర్యారాయ్- సుశ్మితాసేన్- లారా దత్తా- ప్రియాంక చోప్రా- సారా జేన్ డయాస్ - మానుషి చిల్లర్ లాంటి భామలు ఇండియా రేస్ లో అలాగే వరల్డ్ వైడ్ కాంపిటీషన్స్ లో సత్తా చాటి మిస్సులుగా కిరీటం అందుకున్నారు.
కాస్త సర్ ప్రైజింగ్ అనిపించినా కానీ ఇది నిజం. ఇప్పుడు ఈ రేస్ లోకి యాంగ్రీ హీరో .. డాక్టర్ రాజశేఖర్ - నటి జీవితల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ కూడా చేరుతున్నారు. శివానీ పరిచయం అవసరం లేదు. ఇప్పటికే నటిగా లక్ చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆశించినంత ఘనమైన లాంచ్ తనకు దక్కలేదన్నది నిజం. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన `అద్భుతం` చిత్రంతో OTT వేదికపైకి ప్రవేశించిన ఈ బ్యూటీ.. మరోసారి OTT కోసమే పని చేస్తోంది. శివానీ రెండవ చిత్రం WWW కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను పొందింది.
OTTలో తన ప్రయత్నాల తర్వాత ప్రస్తుతం యంగ్ బ్యూటీ ప్రణాళికలు ఛాలెంజింగ్ గా ఉన్నాయని భావించాలి. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదిక ద్వారా... శివాని మిస్ ఇండియా రేస్ లో పాల్గొంటున్నట్లు ప్రకటించింది.
``కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాను.. నాకు అదృష్టం కావాలి! మిస్ ఇండియా ఓ.ఆర్.జీ... ఈ అద్భుతమైన అవకాశానికి చాలా ధన్యవాదాలు. కృతజ్ఞత మరియు గౌరవం. ఈ రోజు ఆడిషన్స్ కు వెళుతున్నాను. ఇలా ముందుకు సాగుతున్న అద్భుతమైన ప్రయాణానికి తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అందమైన మహిళలందరికీ (నాతో సహా) ఆల్ ది వెరీ బెస్ట్`` అని సోషల్ మీడియాలో తెలిపింది. పోటీదారులకు శుభాకాంక్షలు చెప్పింది శివానీ.
శివానీ హైటు వెయిట్ కి గుడ్ మార్క్స్ ఉన్నాయి. గ్రేస్ పరంగా మెరుగులు దిద్దుకుంటోంది. నటిగా ఇంకా తొలి అడుగుల్లోనే ఉంది. మునుముందు నిరూపించాల్సి ఉంటుంది. ప్రస్తుత కెరీర్ మ్యాటర్ కి వస్తే... తదుపరి రాజశేఖర్ నటిస్తున్న చిత్రం `శేఖర్`లో శివానీ అతిథి పాత్రలో కనిపించబోతోంది. ఇది వచ్చే నెలలో విడుదల కానుంది.
నటన పరంగా వైవిధ్యం ప్రదర్శిస్తే ఈ యంగ్ బ్యూటీ మరిన్ని అవకాశాల్ని అందిపుచ్చుకుంటుంది. అందాల పోటీల్లో నెగ్గుకొస్తే .. ఆదరణ దక్కించుకుంటే ఆ ఆకర్షణ గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశాల్ని తెస్తాయనడంలో సందేహం లేదు. అందాల పోటీల ద్వారా వ్యక్తిత్వ పరంగా మెరుగవుతారనడంలోనూ డౌట్స్ అక్కర్లేదు. శిక్షణతో రాటు దేలతారు. శివానీ లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిద్దాం.