కొత్త కాన్సెప్ట్ తో కొత్తగా చేసే ప్రయత్నాలకు ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇంట్రెస్టింగ్ గా సాగే సినిమాలను యూత్ బాగా ఇష్టపడుతోంది. అలా ఒక కొత్త పాయింట్ పట్టుకుని వచ్చిన 'అద్భుతం' సినిమా కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, తేజ సజ్జ జోడీగా శివాని నటించింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, నిన్న రాత్రి సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేదికపై శివాని మాట్లాడింది.
"ఇంతకుముందు డాడీతో కలిసి ఒక సినిమాను చేశాను .. కానీ ఆ సినిమా బయటికి రాలేదు. ఆ సినిమాలో ఎమ్మెస్ నారాయణగారి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ సినిమా సమయంలోనే ఆయన చనిపోయారు. అందువలన ఆ ప్రాజెక్టును ఆపేయవలసి వచ్చింది. అప్పటి నుంచి కూడా నా సినిమా ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురుచూస్తున్నాను. ఆ తరువాత 'టు స్టేట్స్' సినిమాకి ఓకే చెప్పాను .. కొన్ని రోజుల తరువాత అది కూడా ఆగిపోయింది. సరేలే తమిళంలో అయినా చేద్దామని అనుకుంటే అది పోస్ట్ పోన్ అయింది .. మళ్లీ మొదలుపెడతారో లేదో తెలియదు.
'అద్భుతం' కథ వినగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఆ సినిమాలో నేను చేసిన 'వెన్నెల' పాత్ర నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ పాత్రను చేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా షూటింగు అయిపోయిన తరువాత, కోవిడ్ అనేది వస్తుందట అని అంతా చెప్పుకోవడం విన్నాను. ఇక్కడికి రాదులే అనుకున్నాను .. కానీ ఇక్కడికి కూడా వచ్చేసింది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా కొంతకాలం పాటు ఆగిపోయింది. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఆ సమయంలో నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్లాను. లాక్ డౌన్ అయిపోయిన తరువాత ఈ సినిమా థియేటర్ కి వెళితే జనాలు వస్తారా? ఓటీటీకి వెళ్లడం మంచిదా? అనే ఒక సందేహం వచ్చింది.
లాక్ డౌన్ తరువాత థియేటర్స్ లో వచ్చిన కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు థియేటర్ కి వెళదామని అనుకుంటూ ఉండగా సెకండ్ లాక్ డౌన్ వచ్చేసింది. అప్పుడు నేను చాలా ఫీలయ్యాను. అప్పుడు శివాని జాతకం ఒకసారి చూపించండి అని చాలామంది చెప్పారు. ఫస్టు నేను నమ్మలేదు గానీ .. ఆ తరువాత ఎందుకు నాకు ఇలా జరుగుతోంది అని అనుకున్నాను. నాది ఐరన్ లెగ్గా? నాది బ్యాడ్ లక్కా? అని చాలా ఫీలయ్యాను. అప్పుడు మా పేరెంట్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. అయితే ఈ గ్యాపులో నేను తమిళంలో రెండు సినిమాలు పూర్తి చేశాను.
శివాని ఎప్పుడూ బిజీగా ఉంటుంది .. కానీ ఆమె సినిమా మాత్రం బయటికి రావడం లేదని మా ఇంట్లో నన్ను ఆటపట్టిస్తూ ఉంటారు. ఇవన్నీ దాటుకుని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి 'అద్భుతం' సినిమాకి ఒక మంచి ఆఫర్ వచ్చింది. థియేటర్లకు జనాలు అంతగా రాకపోతుండటంతో ఈ సినిమాను వాళ్లకి ఇవ్వడం జరిగింది. నా షూటింగులో నేను .. తేజ షూటింగులో తేజ బిజీగా ఉండటం వలన పబ్లిసిటీ కూడా సరిగ్గా చేయలేకపోయాము. ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం జనాలకు తెలుసా లేదా? అనే ఒక బాధ కూడా ఉండేది.
నా సినిమా రిలీజ్ అయిందనే విషయాన్ని నేను నమ్మడానికి ఒక రోజు పట్టింది. ఆ తరువాత హిట్ అయిందని చెప్పేసి పేరెంట్స్ చెప్పారు .. ఇక హ్యాపీగా ఉండమని అన్నారు. ఇక ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఇంతగా హిట్ చేసిన ప్రేక్షకులకు ఈ స్టేజ్ ద్వారా నేను థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించింది.