రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా? దబిడ దిబిడే!! రాజుగారి ఇంట పెళ్లి బాజా అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ఊహించాల్సిన పనేలేదు. గాలి వారి పెళ్లి.. ఆ తర్వాత అంబానీల పెళ్లి గురించి అంతే ఇదిగా చెప్పుకున్నాం. ఇటీవలే అంబానీల ఇంట పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఇంట వరుస పెళ్లి వేడుకలు హీట్ పెంచేస్తున్నాయి. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్లి పెరుమాళ్ గ్రూప్ ఓనర్ అజయ్ పిరమాళ్ కొడుకు ఆనంద్ పిరమాళ్ తో అత్యంత వైభవంగా జరిగింది. ఆ పెళ్లి కోసం ఏకంగా 725కోట్లు ఖర్చు చేయడంపై ఊరూ వాడా ఆసక్తిగా మాట్లాడుకున్నారు.
అయితే ఆ పెళ్లితో అయిపోలేదు. అసలు పెళ్లి ముందుంది. ఈసారి దాదాపు 1000 కోట్లు ఖర్చు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదట. ముఖేష్ అంబానీ ఏకైక కుమారుడు .. ఆకాష్ అంబానీ - వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా వివాహం మార్చి 9న ముంబైలో జరగనుంది. ఆ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.. ఆ స్నేహం ప్రేమగానూ మారింది. అందుకే ఈ జంట పెళ్లాడేసుకునేందుకు రెడీ అయ్యారు. పెద్దల అంగీకారంతో ఈ పెళ్లి జరుగుతోంది. ఇషా అంబానీ డిస్టినేషన్ వెడ్డింగ్ తరహాలోనే ఆకాష్ పెళ్లి కూడా జరగనుందట. మూడు రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ ఇండస్ట్రీ బెస్ట్ ప్రముఖుల సమక్షంలో కనీ వినీ ఎరుగని రీతిలో జరగనుంది.
అందుకోసం ఇప్పటికే వెన్యూ కూడా బుక్ అయ్యింది. మార్చి 9న ముంబై- బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్ లో వివాహం జరగనుంది. అదే రోజు 3.30పీఎం ముంబైలోని విలాసవంమైన ట్రిడెంట్ హోటల్ లో మంగళ బారాత్ ఉంటుంది. అది జియో వరల్డ్ సెంటర్ కు చేరుకున్నాక సాయంతం 6:30కు హై టీ పార్టీ .. ఆ తర్వాత 7:30 ప్రాంతంలో వివాహం జరుగుతుంది. మార్చి 10న వివాహ విందు అంగరంగ వైభవంగా ఉంటుందిట. ఆ మరుసటి రోజున అక్కడే రిసెప్షన్ ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 23 - 25 తేదీల్లో స్విట్జర్లాండ్ లో ఆకాష్ అంబానీ - శ్లోకా మెహతాల బ్యాచిలర్ పార్టీ హై క్లాస్ గా జరగనుందని తెలుస్తోంది. ఈ వివాహానికి 500 మంది పైగా ది బెస్ట్ అతిథులు హాజరు కానున్నారని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. ఇక అంబానీల పెళ్లి అంటే బాలీవుడ్ మొత్తం కదిలి వెళుతుందనడంలో సందేహం లేదు. ఇదివరకూ అంబానీ కుమార్తె పెళ్లి వేడుకలో రిసెప్షన్ కార్యక్రమాల్ని ముంబై టాప్ సెలబ్రిటీలు దగ్గరుండి జరిపించారు. షారూక్ - అమితాబ్ - అమీర్ ఖాన్ - రణబీర్ అంతటి వాళ్లు అతిధులకు దగ్గరుండి వడ్డనలు చేశారు. మరోసారి వీళ్లందరికీ ఆ సద్భాగ్యం కలగనుంది. పైగా ఆకాష్ అంబానీకి రణబీర్ క్లోజ్ ఫ్రెండ్. అందువల్ల ఈ పెళ్లిలో అతడి సందడి పీక్స్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరో సన్నిహితుడు.. దర్శకనిర్మాత కరణ్ జోహార్ సైతం తొలి నుంచి ఈ పెళ్లి వేడుక ఆద్యంతం ఇన్విజిలేట్ చేస్తాడట.