రణబీర్ కపూర్-అలియాభట్ వివాహం జరిగి నాలుగైదు రోజులే అయింది. ఇంకా చుట్టాలు-పక్కాలు పెళ్లి మూడ్ నుంచి బయటకు రాలేదు. ఎవరి ఇంటికొచ్చిన అతిధులు ఇంకా వాళ్ల ఇళ్లలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. పెళ్లి పనులతో అలసి సొలసిన వారంతా విరామంలోనే ఉన్నారు. వీలైనంత సమయాన్ని నిద్రించడానికే కేటాయిస్తున్నారు. కానీ అలియాభట్-రణబీర్ దంపతులు అప్పుడే సినిమా షూటింగ్ లకు హాజరై షాక్ ఇచ్చారు.
అవును ముంబై లో రిసెప్షెన్ అనంతరం కొత్త దంపతులు హానీమూన్ కి ఆప్రియా వెళ్లనున్నారని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. కొత్త ప్రదేశం వెళ్లి ఇబ్బందులు పడటంకన్నా తెలిసిన ప్రాంతానికే వెళ్తే బాగుటుందని ..దీనిలో భాగంగా ఇప్పటికే రెండు..మూడు సార్లు చుట్టేసిన ఆప్రియానే వెళ్లనున్నారని ప్రచారం సాగింది. అక్కడ కొన్ని రోజుల పాటు నవ దంపతలు ఏకాంతంగా రిలాక్స్ కానున్నారని..అటుపై ఎవరి వృత్తుల్లో వాళ్లు బిజీ అవుతారని భావించారు.
కానీ ఈ జంట అందరి అంచనాల్ని..ఆలోచనల్ని తారుమారు చేసింది. రణబీర్ కపూర్ టీసిరిస్ ఆఫీస్ లో స్ర్కిప్ట్ పనుల్లో బిజీ అయ్యారు. దర్శక బృందంతో కలిసి రణబీర్ సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. అలాగే అతని పై టెస్ట్ షూట్ కూడా నిర్వహించారు. ఈనెలలో మనాలిలో `యానిమల్` షూటింగ్ ప్రారంభించనున్నారు. దీనికి టాలీవుడ్ మేకర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి తొలి షెడ్యూల్ పూర్తయ్యే వరకూ గ్యాప్ లేకండా రణబీర్ షూట్లో పాల్గొంటారుట. ఆయనతో పాటు రష్మిక మందన్న కూడా జాయిన్ కానుందని తెలుస్తోంది.
ఇక అలియాభట్ జైసల్మేర్ లో ఉందిట. రణవీర్ సింగ్ సరసన నటిస్తోన్న `రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని` చిత్రం షూటింగ్ జైసల్మేర్ లో జరుగుతోంది. అందుకే పెళ్లితంతు పూర్తికాగానే అలియాభట్ జైసల్మేర్ ప్లైట్ ఎక్కినట్ల తెలుస్తోంది. మొత్తానికి హానీమూన్ ని ఈ జంట ప్రస్తుతానికి లైట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ జంట పెళ్లికి ముందు ఐదేళ్లు ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరగని ప్రదేశం లేదు. తిరగని దేశం లేదు. తెలియని రహస్య ప్రదేశాలు లేవు.
పెళ్లికి ముందే ప్రేమ జీవితంలోనే పెళ్లైన అనుబంధాన్ని చదివేసారు. అందుకేనమో మళ్లీ కొత్తగా హానీమూన్ ఎందుకుని ఎవరి వృత్తుల్లో వారు బిజీ అయ్యారంటూ నెటి జనులు జోకులేస్తున్నారు. ఇంకొంత మంది హనీమూన్ ఖర్చులు కలిసొస్తాయని వెళ్లడం లేదా? అంటూ సరదా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. కారణాలు ఏవైనా పెళ్లైనా మూడు రోజులకే ఇద్దరు షూటింగ్ కి హాజరు కావడం చాలా మందిని విస్మయపరుస్తుంది.